మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘రావణాసుర(Ravanasura)’. సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వం(Direction)లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో సుశాంత్(Sushanth) కీ రోల్ లో నటించారు. సినిమా ప్రమోషనల్ కార్య క్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్(Theatrical Business) ఎంత జరిగిందనే దానిపై ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి. నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక ఓవర్ సీస్లో రూ.2.20 కోట్లకు హక్కులు అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్ థియేట్రికల్‌గా రావణాసుర చిత్రం రూ.22.20 కోట్లు బిజినెస్ జరుపుకుంది. సినిమా హిట్ కావాలంటే రూ.23 కోట్లు కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంది.
అలాగే రావణాసుర సినిమాను థియేటర్స్ లో భారీగానే విడుదల చేస్తున్నారు మేకర్స్(Makers). నైజాంలో 235, సీడెడ్‌లో 165, ఆంధ్రాలో 300 థియేటర్స్.. టోటల్‌గా తెలుగు రాష్ట్రాల్లో 700 థియేటర్స్ లో మూవీ రిలీజ్ అవుతుంది. కర్ణాటక ఏరియాలో 75, ఓవర్ సీస్లో 150 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 925 థియేటర్స్ లో రావణాసుర మూవీ రిలీజ్(Release) కానుంది. ఇక ఈ సినిమాని అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్(Abhishek Arts Banner) మీద అభిషేక్ నామా అలాగే రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్(RT Team Works Banner) మీద సంయుక్తంగా నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని రవితేజ సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. పుష్ప సినిమాకి కథ అందించిన శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి కూడా కధ అందించడం విశేషం.
సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ హీరోయిన్స్(Heroine) గా నటించారు. ఈ సినిమాలో రవితేజ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సినిమా నుంచి విడుదలైన టీజర్(Teaser), ట్రైలర్(Trailer) కూడా ప్రేక్షకుల(Audience)ను నుంచి మంచి ఆదరణ(Good response) పొందింది.
ఈ చిత్రం కోసం రవితేజ తొలిసారి క్రిమినల్ లాయర్(Criminal Lawyer) పాత్ర లో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం రవితేజ (Ravi Teja) కొంత మంది లాయర్స్ ను కలిసి వారి బాడీ లాంగ్వేజ్(Body Language)ను నేర్చుకుని మరీ నటించటం విశేషం.
హర్ష వర్ధన్ రామేశ్వర్(Harshavardan Rameshwar), భీమ్స్(Bheems) ఈ చిత్రానికి సంగీతాన్ని(Music) అందించారు. శ్రీకాంత్ విస్సా(Srikanth vissa) కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.