స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదల(Release) చేసింది. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 11,409 పోస్టుల్నిభర్తీ చేస్తోంది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు 10880 ఉండగా, హవల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ(Application Process) కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 ఫిబ్రవరి 17 చివరి తేదీ(Last Date). కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(CBE) ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం లాంటి 13 ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల(Full Details) కోసం అధికారిక వెబ్సైటు(Official Website) ని సందర్శించండి. ఇక ఈ నోటిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
రిజిస్ట్రేషన్ చేయండి ఇలా:
- అభ్యర్థులు(Candidates) ముందుగా https://ssc.nic.in/ వెబ్సైట్(Website) ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో New User ? Register Now పైన క్లిక్ చేయాలి.
- పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్(Declaration Fill) చేయాలి.
- మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ(OTP)ని ఎంటర్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ(Registration) పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్(Generate) అవుతుంది.
దరఖాస్తు చేయండి ఇలా
- రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత దరఖాస్తు చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్(Login) కావాలి.
- లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి వివరాలు డిస్ప్లేలో కనిపిస్తాయి.
- ఆ వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్(Edit) చేయొచ్చు.
- ఆ తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి.
- ఫోటో, సంతకం అప్లోడ్(Upload) చేయాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
గతంలోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వన్‌టైమ్(One time) రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా రెండో పద్ధతి ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 17 రాత్రి 11 గంటల లోగా దరఖాస్తు చేయాలి. ఆన్లైన్(Online) ఫీజ్ పేమెంట్ 2023 ఫిబ్రవరి 19 రాత్రి 11 గంటల లోగా చేయాలి. ఆఫ్‌లైన్ చలానా(Offline Challan) 2023 ఫిబ్రవరి 19 రాత్రి 11 గంటల లోగా జనరేట్ చేయాలి.2023 ఫిబ్రవరి 20 బ్యాంకు వేళలు ముగిసేలోగా ఆఫ్‌లైన్ చలానా చెల్లించాలి. దరఖాస్తు ఫామ్‌ను కరెక్షన్(Correction) చేయడానికి 2023 ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 24 రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2023 ఏప్రిల్‌లో ఉంటుంది.