ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP State) లో ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు(Notifications) విడుదల(Release) అవుతున్నాయి. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల(Group2,3 Posts) భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయి. వీటితో పాటు తాజాగా జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
ఇటీవల శ్రీసత్య సాయి జిల్లా(Sri Satyasai District)లో అంగన్ వాడీ ఉద్యోగాల(Anganwadi Jobs)కు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్ జిల్లా(YSR Districts) మహిళాభివృద్ధి(Women Development), శిశు సంక్షేమ(Child Welfare) శాఖ కార్యాలయం వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టు(ICDS Projects)ల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు(Applications) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు(Full Details) ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య 148. వీటిలో 37 అంగన్ వాడీ వర్కర్స్(Workers) ఉండగా 108 అంగన్ వాడీ హెల్పర్స్(Helpers), అంగన్ వాడీ మినీ వర్కర్ పోస్టులు మూడు ఉన్నాయి.
అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 10వ తరగతి, అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ మినీ వర్కర్(Mini Workers) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు(Age) 01-07-2023 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. తగిన విద్యార్హత సర్టిఫికేట్ల(Education Certificate)తో గెజిటెడ్ ఆఫీసర్(Gazetted Officer) తో అటెస్టేషన్(Attestation) చేయించి.. వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయం నందు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ(Last Date) జనవరి 11(January 11th), 2023.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 12, 2023 ఉదయం 11 గంటలకు సంబంధిత రెవెన్యూ డివిజినల్ అధికారి(Revenue Divisional Officer) కార్యాలయంలో ఇంటర్వ్యూలు(Interview) నిర్వహించనున్నారు.
పూర్తి వివరాలకు https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ సందర్శించండి.