మెగాస్టార్(Mega star) చిరంజీవి(Chiranjeevi) హీరోగా వాల్తేరు వీరయ్య(Walteru Veerayya) అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ(Bobby) డైరెక్షన్లో(Direction) మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్(Huge Budget) తో నిర్మించింది.
రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీయంట్రీ(RE entry) ఇచ్చిన తర్వాత సైరా, ఆచార్య సినిమాలు మినహా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలన్నీ రీమేక్(Remake) సినిమాలే కావడంతో ఈ ఒక్క సినిమా మీద ప్రేక్షకుల(Audience)తో పాటు మెగా అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాని జనవరి 13వ తేదీ సంక్రాంతి(Sankranthi) సందర్భంగా రిలీజ్ చేసేందుకు సన్నద్మౌతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్(Movie Unit) ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్(Pre-Release Event) మరో లెవల్లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా టైటిల్‌కు తగినట్లుగానే విశాఖపట్నంలోని వాల్తేరులో నిర్వహించేందుకు సినిమా యూనిట్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి మెగా అభిమానులు ఒక స్పెషల్ ట్రైన్లో(Special Train) ఈ వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి హాజరయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో మాస్ మహారాజా(Mass Maharaja) రవితేజ(Raviteja) కూడా ఒక కీలకపాత్ర(Key Role)లో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్(Shruthi Hassan) హీరోయిన్(Heroine) గా నటిస్తూ ఉండగా టాలీవుడ్ లోని అనేకమంది సీనియర్ నటీనటులు కూడా సినిమాలో భాగమయ్యారు.
ఇక ఈ సినిమా ఒకపక్క నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాతో పోటీపడుతూనే మరో పక్క తమిళ్ స్టార్ విజయ్, వారసుడు సినిమాతో కూడా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయ్, వీర సింహారెడ్డి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతూ ఉండగా ఈ సినిమా మాత్రం 13వ తేదీ సింగిల్ గా రిలీజ్ అవుతుంది.