ద్రాక్ష (Grapes)పండ్లలో ఉండే పోషకపదార్దాల(Nutrients) వలన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అజీర్తి(Digestion), మలబద్దకం(Constipation) సమస్యలతో బాధపడేవారికి ద్రాక్ష పండ్లను తింటే ఆ సమస్యలు తగ్గుముఖం(Reduces) పడతాయి.
తీయనైన ద్రాక్షలో విటమిన్లు(Vitamins), యాంటీ యాక్సిడెంట్లు(Anti Oxidants) మెండుగా ఉంటాయి. నీరు సంవృద్ధిగా ఉంటాయి.ఆకుపచ్చ(Green) లేదా ఎరుపు(Red) రంగుల్లో ఈ పండ్లు లభ్యమవుతాయి.వీటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు(Healthy Benefits) ఏంటో చూద్దాం! ద్రాక్ష వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. ద్రాక్షలో విటమిన్ సి,ఏ బి6, ఫోలిక్ ఆమ్లం(Folic Acid) పుష్కలంగా ఉంటాయి.
ద్రాక్ష పండ్లలో ఉండే గ్లూకోస్(Glucose), మెగ్నీషియం(Magnesium), సిట్రిక్ యాసిడ్(Citric Acid) వంటి అనేక పోషకాలు మనలని వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. అలసట(Tiredness), ఆకలి(Hungry)గా అనిపించినపుడు గుప్పెడు ద్రాక్షను తినండి. ఆకలి తీరడం తో పాటు తక్షణ శక్తి లభిస్తుంది.
ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండచ్చు. వీటిలోని పొటాషియం నిల్వలు రక్త పోటు పెరగకుండా నియంత్రిస్తాయి(Controls BP). వీటిలో పీచు(Fiber) కూడా ఎక్కువే, ఇది కొలెస్ట్రాల్ స్థాయి(Cholesterol levels) ని తగ్గిస్తుంది.
మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఈ పండల్లో విటమిన్ కే(Vitamin K) తో పాటు కాల్షియమ్(Calcium), మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గుండె జబ్బులు, కంటి సమస్యలు కొన్ని రకాల కాన్సర్(Cancer) రాకుండా ఇవి అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్మ్యూనిటి తో పాటు వృద్దాప్య ఛాయలు(Aging Shades) రాకుండా అడ్డుకుని చర్మానికి మెరుపులు ఇస్తాయి. ద్రాక్షను క్రమంగా తప్పకుండ తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సాయపడటమే కాకుండా, మధుమేహం, రక్త పోటు, గుండె జబ్బులు చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చును.
మైగ్రైన్(Migraine) వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడచు. జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా నల్ల ద్రాక్ష పండ్లను తినాలి. వీటిలో లభించే విటమిన్లు జుట్టు ఆరోగ్యాని(Hair Health)కి చాలా మేలు చేస్తుంది. ద్రాక్షలో ఉండే విటమిన్ ఈ చుండ్రు(Dandruff), జుట్టు రాలడం(Hair fall) లేదా తెల్లగా మారడం(White Hairs) వంటి జుట్టు సమస్యలను నయం చేస్తుంది.
వీటిని తినడం ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. జుట్టు మందంగా, మృదువుగా, బలంగా మారుతుంది. అజీర్ణాన్ని కలిగినా పదార్దాలను ద్రాక్ష బయటకు నెట్టివేసి శరీరంలో వేడిని తగ్గించి(Reduces heat) మంచి అరుగుదలను పెంచుతుంది. కప్పు పండ్ల నుంచి 62 కేలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్దాలు 16 గ్రా, మాంసకృతులు 0.6 గ్రా, కొవ్వును 0.3 గ్రాములు ఉంటాయి.
ద్రాక్షలో గల పొటాషియం వలన మూత్రపిండాల వ్యాధులు(Kidney Problems) చక్కగా తగ్గుతాయి. పండ్లను జ్యూస్ల కాకుండా నేరుగా తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు వీటిని ఇలాగే అలవాటు చేయాలి. ఎండిన ద్రాక్షనే రైసిన్స్(Raisins), కిస్స్మిస్స్(Kiss mis) అని పిలుస్తారు. వీటిలోని పోషకాలు(More Nutrients) బోలెడు. మధుమేహులు(Diabetes) వైద్యుల చూచిన మేరకు మాత్రమే తినాలి.
ద్రాక్ష పందాలను తినడం వలన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి ద్రాక్ష సహాయం చేస్తుంది.మూడ్ స్ప్రింగ్స్(Mood Springs) కి ద్రాక్ష మంచి స్నాక్ గా పనిచేస్తాయి.మీరు కూడా రోజు వారి ఆహారంలో ఈ సూపర్ ఫ్యూడ(Super Food)ని చేర్చుకోవడం మరచిపోకండి.