పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వం(Direction)లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అనన్య పాండె(Annanya Pandey) జోడి(Pair)గా నటించిన లైగర్ మూవీ(Liger Movie) ఆగస్టు 25(August 25th)న వరల్డ్ వైడ్(World Wide) గా థియేటర్స్ లో సందడి చేయనుంది.
సంచలన మూవీలకి దర్శకత్వం వహించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా రచించి, కో ప్రోడ్యూస్(Co-Produce) చేసి తెరకెక్కించిన మూవీ ఇది. బాలీవుడ్(BollyWood) లో ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహర్(Karan Johar) ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల(Audience) ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుండే ప్రమోషన్స్ విషయంలో తనదైన స్ట్రాటెజీ ప్రదర్శిస్తూ వస్తోంది.
సినిమా షూటింగ్(Shooting) పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలోకొచ్చాకా ప్రమోషన్స్(Promotions) లో మరింత స్పీడ్ పెంచారు. ప్యాన్ ఇండియా(Pan India) సినిమా కావడంతో దేశవ్యాప్తంగా లైగర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన లైగర్ ట్రైలర్(Trailer), రొమాంటిక్ టచ్ ఉన్న సాంగ్స్ సినిమాపై యువతలో మరింత ఆసక్తిని పెంచాయి.
లైగర్ మూవీ రిలీజ్‌కి మరో వారం రోజులే మిగిలి ఉండటంతో సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.140 నిమిషాల 20 సెకండ్స్ నిడివి కలిగిన లైగర్ మూవీకి సెన్సార్(Sensor) బోర్డ్ U/A సర్టిఫికెట్(U/A Certificate) జారీచేసింది. అంతేకాకుండా సినిమాలో పలు సన్నివేశాల్లో ఉపయోగించిన డైలాగ్స్, సైగలపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ముఖ్యంగా ఎఫ్ అనే అక్షరంతో మొదలయ్యే ఇంగ్లీష్ బూతు పదాలు తొలగించడంతో పాటు అభ్యంతరకరంగా ఉన్న కొన్ని సైగలను కనిపించకుండా బ్లర్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్ లైగర్ చిత్ర యూనిట్ కి సూచించింది. అలాగే అమెరికన్ కిక్ బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక మకరంద్ దేశ్‌పాండే వంటి ఇతర స్టార్ నటులు నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్(Puri Connects Banner) మీద చార్మి కౌర్, పూరి జగన్నాథ్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్(Dharma productions Banner) మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా వంటి వారు నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో గ్రాండ్ ప్రీ రిలీజ్(Grand Pre release event) ఈవెంట్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జరగబోతోంది. ఆగస్టు 20(August)వ తేదీ అంటే రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్ లో ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరింత గ్రాండ్ గా చేసేందుకు రంగం సిద్ధం చేశారు దర్శకనిర్మాతలు. ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా సినిమా మీద మరిన్ని అంచనాలు(Expectations) పెంచాలని ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది.