ఎలక్ట్రానిక్ రంగం లో జరుగుతున్నపరిశోధనల గురించి, వాటి ఫలితంగా భవిష్యత్తులో టీ.వీ.లు, ఫొన్లలో వచ్చే పెనుమార్పుల గురించి మనము ఏదో ఒక సందర్బంలో మాట్లాడుకునే ఉంటాము. అటువంటి వింత విషయం ఒకటి ఇప్పుడు నిజం కాబోతుంది. అది ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
టీ.వీ.ల తయారీలో ఉపయోగించే వస్తువులను కొద్దిగా మార్పు చేయడం వల్ల అసలు దాని స్వరూపంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుకు కారణమవుతోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ అయిన LG టీ.వీ.లలో మొట్టమొదటి సారిగా కొద్దిగా వంచగలిగే టీ.వీ.లను తయారు చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రండి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న టీ.వీ.లు ప్రధానంగా LED, LCD మోడల్స్. మరి ఇప్పుడు రాబోతున్నది OLED(Organic Light Emitting Diode).
కొరియన్ సంస్థ అయిన LG వీటిని తయారు చేసింది. ఈ OLED టీ.వీ.లు సంప్రదాయ సిలికాన్ సెమీకండక్టర్ తో కాకుండా ఆర్గానిక్ పాలిమర్స్ తో తయారవడం వల్ల ఈ స్క్రీన్స్ ఎలా అంటే అలా వంచగలగడం (flexible) విశేషం. అలా వంగుతున్నప్పటికి ఈ స్క్రీన్ లోని ఇమేజ్ నాణ్యత ఏ మాత్రం తగ్గక పోవడం దీని యొక్క విశేషం. పైగా ఈ టీ.వీ.లు వెనక మాగ్నేట్స్ ఉండడం వల్ల ఈ టీ.వీ.ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి గోడకు అతికించవచ్చు. ఈ OLED టీ.వీ.లో స్క్రీన్ కేవలం 0.97 mm మందంతో తయారు చేయబడింది.
ఇక ఈ OLED పరిజ్ఞానాన్ని ఫోన్లలో కూడా ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. LG మరియు సామ్సంగ్ ఇప్పటికే ఈ OLED లతో తయారయ్యే ఫోన్లకు సరిపోయే బ్యాటరీలను వెతికే ప్రయత్నంలో ఉన్నాయి. ఇక ఈ 2 కంపెనీల్లో దేని యొక్క సామర్ధ్యం బాగుందనేది మార్కెట్లోకి వస్తేనే కానీ తెలియదు!!