‘కంప్యూటర్ వైరస్'(Computer Virus) ఈ హానీకర వ్యర్థం కూడా అన్ని సాఫ్ట్వేర్(Software)ల తరహాలో ఓ ప్రోగ్రామ్(Program) లాంటిదే వేరొక సాఫ్ట్‌వేర్‌లో నక్కి ఉండే ఈ వైరస్లు మన ప్రమేయం లేకుండా మన కంప్యూటర్లోకి డేటా(Data)ను ధ్వంసం చేస్తాయి.
కొందరు ఆకతాయలు సెల్‌ఫోన్ ఇంకా కంప్యూటర్లలోని సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్‌లను టార్గెట్(Target) చేసుకుని మెసపూరిత అంశాలతో కూడిన అవాంఛనీయమైన సాఫ్ట్ వేర్లను సృష్టించి వీటిని ఇంటర్నెట్ ద్వారా విస్తరింపచేస్తారు. ఈ వైరస్లు ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి వ్యాపిస్తూ సదరు పరికరాల(Devices)ను పనితీరును దెబ్బతీస్తాయి.
రోగాలను వ్యాప్తి చేసే వైరస్లు ఏలాగైతే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయో అలాగే కంప్యూటర్ వైరస్లు కూడా ఒక పీసీ(PC) నుంచి మరొక పీసీల(PCs)కు వ్యాపిస్తాయి. ఇంటర్నెట్(Internet) అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో పర్సనల్ కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌ల(Laptops) వినియోగం పెరిగిపోయింది.
ఈ క్రమంలో వీటి పై దాడిచేసే వైరస్లు ముప్పు అధికమైంది. వైరస్ వ్యాప్తిచెందిన పీసీలో పనితీరు మందగిస్తుంది.. అప్లికేషన్లు(Applications) ఆలస్యంగా స్పందిస్తాయి. ఈ సమస్య మరింత ఉధృతమయితే పీసీని రన్ చెయ్యటం కష్టతరమవుతుంది.
ఈ వైరస్‌లను నియంత్రించే కమ్రంలో అనేకమైన యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు(AVP) పుట్టుకొచ్చాయి. ఈ సాఫ్ట్ వేర్లనుమందుగానే పీసీలో లోడ్ చేసుకున్నట్లయితే వివిధ వైరస్ల ముప్పునుంచి బయటపడొచ్చు.
వైరస్(Virus)లో చాలా రకలే ఉన్నాయి. పలు రకాల వైరస్లు వార్నింగ్ సందేశాల(Warning Messages)ను మాత్రమే పంపి అంతటితో ఆగిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మనను భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. పలు వైరస్లు కంప్యూటర్లోకి ప్రవేశించి డేటా మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాయి.
క్రూరమైన వైరస్లు మన ప్రమేయం లేకుండానే మన మొయిల్(Mail) నుంచి అడ్రస్ బుక్(Address Book)లో ఉన్న అందరికిఅసభ్యకరమైనన సందేశాలను పింపిస్తుంటాయి. వైరస్ల బారి నుంచి రక్షణ పొందాలంటే పీసీలో ఎప్పటికప్పుడు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను ఇన్స్టాల్(Install) చేస్తూఎప్పటికప్పుడువాటిని అప్డేట్ చేస్తుండాలి.
కంప్యూటర్‌కు పెన్‌డ్రైవ్(Pen drive)ను కనెక్ట్(Connect) చేసే ముందుగా సదరు యూఎస్బీ డివైస్(USB Device)ను స్కాన్(Scan) చేయటం మంచిది.