వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాతో తిరిగి సినిమా పట్టాలెక్కి వరుస మూవీలతో బిజీ అయ్యారు పవర్ స్టార్(Power Star) పవన్ కళ్యాణ్. తాజాగా ‘భీమ్లా నాయక్'(Bheemla Nayak)తో ఆడియెన్సు(Audience)కి మాస్ ట్రీట్ ఇచ్చిన ఈ హీరో ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం(Direction)లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు‘(Hari Hara VeeraMallu) చిత్రం షూటింగ్(Shooting)తో బిజీగా ఉన్నారు.
దాదాపు 150 కోట్ల బడ్జెట్(150 Crores Budget) కేటాయించి ఏఎమ్.రత్నం(A.M.Ratnam) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్(Heroine)గా నటిస్తోంది.
గత కొంతకాలంగా షూటింగ్(Shooting) జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకి సంబంధించి మేకర్స్(Makers) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎపిక్ డ్రామా(Epic Drama)గా రూపొందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్(Robin Hood)గా వైవిధ్యమైన లుక్(Different Look)లో కనిపించబోతున్నారు. నిజానికి ఎప్పుడో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా కరోనా(Corona) కారణంగా పలు సార్లు వాయిదా(Postpone) పడుతూ వచ్చింది.
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో శరవేగంగా మిగిలిన చిత్రీకణ పూర్తి చేస్తున్నారట డైరెక్టర్ క్రిష్. ఏప్రిల్(April) నెలాఖరులో సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు, కానీ ఆ డేట్ వరకు అన్ని పనులు పూర్తి కాకపోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో విడుదల తేదీ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట క్రిష్(Krish).
దసరా కానుక(Dasara Gift)గా ఈ మూవీని థియేటర్ల(Theaters)లో విడుదల చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ల విషయంలో సంక్రాంతి సీజన్(Sankranthi Season) తర్వాత ఆ హుంగామ దసరాకే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ దసరాకు మెగా ఫాన్స్(Mega FANS) కు ఐ ఫీస్ట్ ఇచ్చేలా క్రిష్ సన్నాహాలు చేస్తున్నారట.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీరవాణి(Keeravani) బాణీలు(Music) కడుతున్న ఈ సినిమాను తెలుగు(Telugu), హిందీ(Hindi), తమిళ(Tamil), కన్నడ(Kannada), మలయాళ(Malayalam) భాషల్లో విడుదల(Release) చేయనున్నారు.