మెగాప్రిన్స్(Mega Prince) వరుణ్ తేజ్ (Varun Tej), సయీ మంజ్రేకర్(Saiee Manjerkar) హీరో, హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి(Kiran Korapati) దర్శకత్వం(Direction)లో ‘గని’ సినిమా(Gani Movie) రూపొందింది.
ఈ సినిమాని అల్లు అరవింద్(Allu Arvind) సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్(Renasons Films), అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల(Allu Bobby Company Banners) మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్(Boxing Backdrop)లో రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్(Teaser), సాంగ్స్(Songs) కి ఆడియన్స్(Audience) నుంచి మంచి ఆదరణ పొందింది .
ఈ మూవీకి మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) సాంగ్ స్పెషల్ అట్రాక్షన్(Attraction) గా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు నెలల నుంచి వాయిదా(Postpone) పడుతూ వస్తుంది. రీసెంట్ గా ఫిబ్రవరి 25న రిలీజ్ పక్కా అంటూ అనౌన్స్(Announce) చేశారు టీమ్. అంతే కాదు ప్రమోషన్స్(Promotions) కూడా భారీగానే చేశారు.
కాని అదేరోజు పవర్ స్టార్(Power Star) భీమ్లా నాయక్(Bheemla Nayak) రిలీజ్ డేట్(Release Date) అనౌన్స్ చేయడంతో గనీ మరో డేట్ వెతుక్కోక తప్పలేదు. దీంతో మార్చి 4న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమాను ఏప్రిల్ 8(April 8th)న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..
తాజాగా మేకర్స్(Makers) మరో అప్డేట్(Update) అందించారు. ఈ మేరకు 12 సెకండ్ల(12 Seconds) ఓ వీడియో క్లిప్(Video Clip) ను రిలీజ్ చేశారు. మార్చి 17న గని మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్(Theatrical Trailer) రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ విడుదలను ఓ వీడియో(Video) ద్వారా వరుణ్ తేజ్(Varun Tej) తన ఇన్ స్టా(Insta)లో పోస్ట్ చేసి ప్రకటించారు. గ్లౌస్ ఆన్(Gloves ON) అంటూ క్యాప్షన్(Caption) కూడా ఇచ్చాడు. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తం(World Wide)గా విడుదల కానుంది.
అయితే అప్పటి వరకు ఇంకా 20 రోజులకు పైనే సమయం ఉంది. దీంతో తమ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 17న థియేట్రకల్ విడుదల చేయనున్నారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్(Surprize) చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఘని ఒక తీవ్రమైన స్పోర్ట్స్ డ్రామా(Sports Drama)గా తెరకెక్కింది.
ఇందులో వరుణ్ కిక్బాక్సర్(Kick Boxer)గా నటిస్తున్నాడు. 2008 ఒలింపిక్ గేమ్స్(Olympic Games) లో కాంస్య పతకాన్ని సాధించిన బ్రిటిష్ అథ్లెట్(British Athlete) టోనీ డేవిడ్ జెఫ్రీస్(Tony David Jepress) వద్ద వరుణ్ తేజ్ ఈ పాత్ర కోసం శిక్షణ(Training) పొందాడు. జగపతిబాబు(Jagapathi Babu) వరుణ్ తేజ్ కోచ్(Coach)గా కనిపించనున్నారు.