పళ్ల(fruits)లో మన ఆరోగ్యాని(Health)కి మేలు చేసే పోషకాలు(Nutrients) చాలా ఉంటాయి. అయితే ఒక్కో రకం పండు ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన కొన్ని గుణాల(Characters)తో నిండి ఉండడంతో పళ్ళ వలన మనకు మరింత ప్రయోజనం(benefits) చేకూరుతుంది. అయితే ఇక్కడ పుచ్చకాయ వలన కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. ఎర్రని రంగుతో, తీయని రుచితో నోరూయించే పుచ్చకాయ(watermelon)లో ఔషధ గుణాల(Medicinal characters) గురించి తెలుసుకుంటే ఆశ్చర్యమ కలుగుతుంది. పుచ్చకాయలో ఎరుపు రంగు(Red Color) లైకోపీన్(Lycopene) అనే యాంటీయాక్సిడెంట్(Anti Oxidant) వలన వస్తుంది. ఇది కాన్సర్(Cancer)ని, మధుమేహాన్ని(Diabetes) నివారిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.తాజా పండ్లు (fresh Fruits), కూరగాయల (Vegetables) కంటే ఈ లక్షణం పుచ్చకాయ(Watermelon)లో అధికంగా ఉంటుంది. దీని నుండి బాగా ప్రయోజనం పొందాలంటే బాగా ఎరుపు రంగు వున్నా పండును ఎంచుకోవాలి.
గింజలు(Seeds) లేని పుచ్చకాయలో లైకోపీన్ మరింత ఎక్కువగా ఉంటుంది. లైకోపీన్(Lycopene) ఎండ వేడి నుంచి మన చర్మాన్ని రక్షిం(Protects Skin)చే గుణం కూడా వుంది. దీనికి గుండె పోటు(Heart attack) రాకుండా నివారించే శక్తి ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెకు మేలు చేసే జాగ్రత్తలు పాటిస్తూ దీనిని కూడా తినడం వలన ఈ ప్రయోజనం పొందొచ్చు. పుచ్చకాయలో వున్నా అమైనో యాసిడ్(Amino Acids) రక్త ప్రసారాన్ని(Blood Circulation) మెరుగు పరిచి, రక్తపోటును(BP) క్రమబద్ధంగా ఉంచుతుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన దీర్ఘకాలంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్(Rheumatoid Arthritis) రాకుండా నివారించుకోవచ్చు(Controls).పుచ్చకాయలో మన కళ్ళ(Eyes)కు మేలు చేసే విటమిన్ ఏ(Vitamin A) పుష్కలంగా వుంది. ఒక్క మధ్యస్థమనంగా వుండే పుచ్చకాయ ముక్కలోనే మనకు రోజువారీ అవసరమైన విటమిన్ ఏ లో 9 నుంచి 11 శాతం లభిస్తుంది. మన శరీరం(Body)లోని ప్రతి కణాని(Cell)కి నీటి(Water) అవసరం ఉంటుంది. ఈ విషయంలో పుచ్చకాయ చేసే మేలు చాలా ఎక్కువని చెప్పాలి. పుచ్చకాయఎక్కువ తీసుకున్న అందులో తక్కువ క్యాలోరీ(Low Calories)లు ఉంటాయి కనుక బరువు పెరుగుతాం(Weight Gain) అనే భయం లేకుండా దీనిని తీసుకోవచ్చు. ఇందులో పిండి పదార్దాలు తక్కువగా ఉండడం వలన మధుమేహం వున్నా వారికి సైతం దీనిని మేలు చేసే ఆహారంగా చెప్పుకోవచ్చు కనుక మధుమేహులు సైతం తగిన మోతాదులో దీన్ని తీసుకోవచ్చు.
జీర్ణ సంబంధమైన(Digestive problems) సమస్యలు వున్న వారికి కూడా పుచ్చకాయల(watermelon)ను తినడం వలన మేలు కలుగుతుంది. వ్యాయామం(Exercise) చేసే వారికి పుచ్చకాయ మరింత మేలు చేస్తుంది. ఇందులో వున్న పొటాషియం(Potassium) కండరాల నొప్పుల(Muscle Pain( నుంచి ఉపశమనం(Relief) కలిగిస్తుంది. అలాగే పుచ్చకాయలో వున్న నీరు(water), యాంటీ యాక్సిడెంట్లు(Anti oxidants), అమైనో యాసిడ్లు(Amino Acids) అన్ని జిమ్(Gym)లో సాధన చేసేవారికి మేలు చేసేవే పుచ్చకాయ గింజల్లో సైతం పోషకాలు ఎక్కువే ఉంటాయి. పండుతో పాటు వీటిని తిన్న హానిలేకపోగా, మేలే జరుగుతుంది. బాగా పండిన, బాగా నీరు వున్న పుచ్చకాయ(Watermelon)ని ఎంపిక చేసుకుని తింటే దాని వలన మైంత ప్రయోజనాలు పొందవచ్చు పుచ్చకాయను నేరుగా తినవచ్చు లేదా సలాడ్స్(Salads) లో వేసుకుని కూడా మరింత రుచిగాతీసుకోవచ్చు. పుచ్చకాయ పళ్లలో వుండే అనేక రకాల పోషకాలు హెచ్చుగాను, క్యాలరీ(Calorie)sలు తక్కువగాను చాలా మంచి విషయం. బరువు పెరగకూడదు అనే వారికి ఇది మరింత మేలు చేసే ఆహారం(Food) అవుతుంది. దీనిని సౌందర్య(Beauty) సాధనగా కూడా వాడుకోవచ్చు. పుచ్చకాయ గుజును(Watermelon pulp), పెరుగు(Curd) కలిపి మొహాని(Face)కి రాసుకోవడం వలన చర్మం(Skin) అందంగా మృదుత్వం(Soft) సంతరించుకుంటుంది