బిగ్ బాస్(Big Boss) తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ పొందింది. ప్రతి సీజన్లో, ప్రముఖ సెలబ్రిటీలు(Celebrities) లేదా సోషల్ మీడియా(Social Media) స్టార్లు షోలో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తుంటారు. షో పూర్తయ్యే సమయానికి, చాలా మంది కంటెస్టెంట్లు (Contestants) విపరీతమైన పాపులారిటీని పొందారు మరియు బాగా సంపాదించారు. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) ముగిసింది.
ఈ షో గ్రాండ్ ఫినాలే(Grand Finale) లోనే హోస్ట్ నాగార్జున మరో రెండు నెలల్లో సరికొత్త బిగ్ బాస్ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఈ షోని 24*7 అంటే 24 గంటలు ఏకధాటిగా హాట్ స్టార్(Hot Star) లో లైవ్(Live) ప్రసారం చేయనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.
దీంతో షో మేకర్స్ కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అయితే తెలుగులో ఈ షో ప్రసారాలు 24*7 లైవ్ ఇస్తూనే బిగ్ బాస్ మాదిరిగా ఓ గంట హైలైట్స్(High Lights) ని టెలికాస్ట్(Telecast) చేస్తారా? అన్నదానిపై క్లారిటీ(Clarity) రావాల్సి వుంది.
మరో సమాచారం ఏంటంటే, తెలుగు బిగ్ బాస్ ఓటీటీ(Telugu Big Boss OTT) షోకి సారధ్య బాధ్యతల్ని ఓంకార్ చేపట్టనున్నట్టు సమాచారం. బుల్లితెరపై ట్రెండ్ సెట్టే(Trend Setter)రైనా ఓంకార్ ఇప్పటికే ‘ఆట’, ‘సిక్స్త్ సెన్స్’, ‘ఇస్మార్ట్ జోడీ’, ‘మాయా ద్వీపం’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ల(Different Concepts)తో టీఆర్పీ రేటింగ్స్(TRP Ratings) ని కొల్లగొట్టే ఐడియాలు ఓంకార్ అన్నయ్య దగ్గర బాగానే ఉంటాయి.
కేవలం హోస్ట్(Host) చేయడమే కాకుండా, సొంత కాన్సెప్ట్లతో పెట్టుబడి కూడా తనే పెట్టుకుని టీఆర్పీ రేటింగ్స్ ని కొల్లగొట్టడంలో దిట్ట. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ (OAK Entertainments) తో విజయవంతంగా దూసుకుపోతున్న ఓంకార్ చేతికి బిగ్ బాస్ ఓటీటీ(Big Boss OTT) పగ్గాలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఓంకార్ షో అంటే ఎలాగూ ఆయనే హోస్ట్ చేస్తారు.
ఇందులో భాగంగా, షో మేకర్స్(Show Makers) జబర్దస్త్ వర్ష, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ అకా నిఖిలు(Nikhilu), మరియు మరొక సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)ను సంప్రదించినట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షో హోస్ట్(Show Host List) ల జాబితాలో వర్షిణి కూడా ఉంది.
జబర్దస్త్ ద్వారా వర్ష మంచి పేరు తెచ్చుకుంది. నిఖిలు ఒక డిజిటల్ క్రియేటర్(Digital creator) మరియు హోస్ట్(Host) గా వ్యవహరిస్తుంటాడు. వైష్ణవి చైతన్య విషయానికి వస్తే, ఆమె సాఫ్ట్ వేర్ డెవలపర్ మరియు మిస్సమ్మ అనే వెబ్ సిరీస్(Web Series)లలో నటించింది. ఆమె అల్లు అర్జున్ సోదరిగా అలా వైకుంఠపురములో కూడా కనిపించింది.
ఇక బిగ్ బాస్ ఓటీటీ(Big Boss OTT) కంటెస్టెంట్స్(Contestants) విషయానికి వస్తే, ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ సిద్ధమైందని తెలుస్తోంది. సీజన్ 5 కంటెస్టెంట్స్ గా చాలామందికి ఫోన్లు వెళ్లాయి. చివరికి 19 మందిని ఫైనల్గా చేశారు. అయితే సెలక్షన్ లిస్ట్ లో చాలామంది పేర్లు ఉండగా, వాళ్లలో కొంతమందిని ఓటీటీ(OTT) షోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అసలు సంగతి ఏంటంటే, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చా, కత్తర్ పాప, యాంకర్ శివ, బంజారాహిల్స్ ప్రశాంత్, టిక్ టాక్ దుర్గారావు వంటి పేర్లు కూడా ఈ ఓటీటీ బిగ్ బాస్ లిస్ట్(List) లో ఉండటం షాకింగ్ అనే చెప్పాలి.
ఈ పేర్లు ప్రచారం దాక అయితే ఓకే కానీ, బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్(Big Boss OTT Contestants ) అయితే మాత్రం అంతకంటే అరాచకం వేరొకటి ఉండదని చెప్పాలి. అయితే ఈ షో హోస్ట్ మరియు కంటెస్టెంట్స్ గురించి ఇంకా అధికారికంగా(Officially) ప్రకటించాల్సి వుంది.
.