ఐఐటీ(IIT)ల్లో మాస్టర్స్‌ ప్రోగ్రాముల్లో(Masters Program) ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE)– 2022 పరీక్ష షెడ్యూల్(Exam Schedule) రిలీజయ్యింది.

ఈ సంవత్సరం  ఐఐటీ ఖరగ్‌పూర్(IIT Kharagpur) గేట్ (GATE) 2022 పరీక్షను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు పలు నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (GATE Admit Cards) జనవరి 3న విడుదలకానున్నాయి. అభ్యర్థులు మొత్తం షెడ్యూల్‌ను, అడ్మిట్ కార్డులను ఐఐటీ ఖరగ్పూర్ (IIT Kharagpur) ఆఫీషియల్ వెబ్‌సైట్(Official Website)  https://gate.iitkgp.ac.in/  నుంచి డౌన్లోడ్ (Download) చేసుకోవచ్చు.

పరీక్ష రోజు వరకు అడ్మిట్ కార్డ్‌(Admit Card)లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే కాకుండా బీడీఎస్ (BDS), ఎం.ఫార్మా (M.Pharm) అర్హత(Candidates) కలిగిన విద్యార్థులు కూడా ఈసారి గేట్ పరీక్షల(GATE Exam)కు దరఖాస్తు చేసుకునే ఛాన్స్(chance)  కల్పించారు.

పరీక్ష షెడ్యూల్‌:

ఈ పరీక్షలను మొత్తం రెండు సెషన్ల(Sessions)లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.

తాజాగా విడుదల చేసిన గేట్ బ్రోచర్(Gate Boucher) ప్రకారం. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)) గ నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు  జరుగుతుంది. గేట్ పరిక్ష ఫలితాల(results)ను 2022 మార్చి 17న విడుదల(Release) చేయనున్నారు.

ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు:

గేట్ స్కోర్(GATE Score) ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT)లతో పాటు దేశంలోని పలు  ప్రభుత్వ(Government), ప్రైవేట్(Private) కాలేజీల్లో ఎంఈ(ME)/ ఎంటెక్(M.TECH) ప్రవేశాలు పొందవచ్చు. దీనితో పాటు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్(PSA)లు సైతం గేట్ స్కోర్ను ప్రామాణికంగా నియామకాలు చేపడుతున్నాయి.

గేట్ స్కోర్తో బీహెచ్ఈఎల్(BHEL), పవర్ గ్రిడ్(Power Grid), బెల్(BELL), డీఆర్డీఓ(DRDO), సెయిల్(SAIL), గెయిల్(GAIL), హాల్(HALL), ఇండియన్ ఆయిల్(Indian Oil) వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు(Jobs) దక్కించుకోవచ్చు. పైన పేర్కొన్న ఈ సంస్థలు కేవలం గేట్ స్కార్ ఆధారంగా అభ్యర్థుల(Candidates)ను షార్ట్లిస్ట్(shortlist) చేసి ఇంటర్వ్యూ(Interview) నిర్వహించి ఉద్యోగాల్లో నియమిస్తారు.

గేట్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్….