బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) పదకొండో వారం తొమ్మిది మంది కంటెస్టెంట్స్(Contestants) లో రవి మినహా మిగిలిన ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఈ వారం కెప్టెన్సీ(Captaincy) టాస్క్ చాలా రసవత్తరంగా సాగుతోంది. అయితే మంగళవారం ఎపిసోడ్ మాత్రం సిరి, షన్నుల మధ్య గొడవ హైలైట్ గా నిలిచింది.
ఇంతకీ ఆ కెప్టెన్సీ టాస్క్ ఏంటో? సిరి, షన్నుల గోల ఏంటో? తెలియాలంటే 73 వ ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే…..
సోమవారం జరిగిన నామినేషన్స్(Nominations) నుంచి హౌస్ మేట్స్(House mates) అంత సులభంగా జీర్ణించుకోలేకపోయారు. కాజల్ అయితే సిరికి నేనంటే ఇష్టం లేదు, అఫెక్షన్ లేదంటూ బోరుమని ఏడ్చేసింది. ఇది చూసిన యానీ అదంతా డ్రామా, స్ట్రాటజీ అని చిరుబుర్రులాడింది. పైగా తన కోసమే ఏడుస్తుందేమోనని ఫీలైన యానీ ఆమె దొంగ ఏడుపులకు కరగనని, తాను మాత్రం ఆమె దగ్గరకు వెళ్లే ప్రసక్తి లేదని ఖరాఖండిగా చెప్పుకొచ్చింది.
తర్వాత ప్రియాంక సన్నీ తో తను మానస్ అట ఆడుతున్నానని సిరి ఎలా అంటుందని మండిపడింది. దీంతో పింకీ తన మనసులోని మాటను బయటపెట్టింది. ట్రాన్స్‌జెండర్‌గా నేను అతడిని ప్రేమిస్తున్నాను, కానీ అదిక్కడ సెట్ కాదు. నా గేమ్(Game) నేను ఆడట్లేదని సిరి ఎలా అంటుంది? అని ఆవేశపడింది.
ఇక ఈ వారం బయటకు వెళ్లిపోతానని ఫిక్సైన కాజల్ తన ఫ్రెండ్స్ తో జ్ఞాపకాలను కూడబెట్టుకోవాలనుకుంది. మరోపక్క బాగా దిష్టి తగలడం వల్లే దిష్టితాడు తెగిపోయిందని, ఈసారి అది తెగిపోకుండా గట్టిగా ముడివేసి దానికి తన రక్తపు బొట్టును పెట్టి మరీ షణ్ముఖ్ చేతికి కట్టింది.
అయితే కావాలని గుచ్చుకున్నావా? లేదంటే అనుకోకుండా తగిలిందా? అని షణ్ను అడగ్గా అనుకోకుండానే కట్ అయి రక్తం వచ్చిందని చెప్పింది సిరి.
బిగ్‌బాస్ హౌస్ మేట్స్(House mates) కు ‘మీ ఇల్లు బంగారం కాను’ అనే కెప్టెన్సీ(Captency) పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బజర్ మోగినప్పుడు ముందుగా హ్యాట్లను పట్టుకున్నవారికి గోల్డ్ మైన్(Gold mine)లో నుంచి వీలైనంత ఎక్కువ బంగారం తీసుకునే ఛాన్స్ ఇచ్చాడు.
అయితే టాస్క్ మధ్య లో పవర్ రూమ్ బజార్ మోగుతుంది ఏ ఇంటి సభ్యుడైతే ముందుగా బజార్ నొక్కుతారో వారికీ పవర్ రూమ్ యాక్సెస్ లభిస్తుంది. మెరుపుల శబ్ధం వచ్చినప్పుడు ముందుగా మానస్ పవర్ రూమ్(Power room) యాక్సెస్ పొందగా అతడి గొడ్డలి రూమ్ రూపం లో పవర్ పొందాడు. అయితే ఆ గొడ్డలిని సన్నీకిచ్చాడు. దీని పవర్ ఏంటనేది బిగ్‌బాస్(BIG Boss) సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాడని తెలిపాడు.
ఇక సిరి ఒకరితో రిలేషన్, నేనొకరితో రిలేషన్లో ఉన్నాం. కానీ హౌస్‌లో మేమిద్దరం ఎమోషనల్(Emotional)గా కనెక్ట్ అయ్యాం. అదే నాకు సమస్యగా మారింది. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నానని మనసులోని బాధను శ్రీరామ్‌తో పంచుకున్నాడు షణ్ముఖ్.
అయితే ఎప్పటిలాగే సిరి- షణ్ను మళ్ళీ గొడవపడ్డారు. నీ ముఖం చూస్తేనే చిరాకుగా ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపో అనడంతో షణ్ను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ గొడవతో ఏడ్చేసిన సిరి సన్నీ నామినేషన్స్(Nominations) ను ఇమిటేట్(Immitate) చేస్తుంటే నవ్వేసింది. దీంతో షణ్ను దీన్నే డబుల్ ఫేస్ అంటారని, నా దగ్గర ఇలా ఉండకు, నన్ను మర్చిపో అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వున్నా నాకు ఫరాఖ్ పడలేదన్నాడు. మాటలు అయితే అన్నాడు కానీ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బాత్రూమ్లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేశాడు. దీంతో సిరి అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించింది. నువ్వే మాటలు అంటావు, మళ్లీ నువ్వే బాధపడాతవేంటని అడిగింది. దీంతో షణ్ను నేను ఏడ్వడం వల్ల నువ్వేం తక్కువైపోవు, నా క్యారెక్టరే తప్పు, వెళ్లిపో అని గట్టిగా అరిచాడు.నాకు దీపు చాలా గుర్తొస్తుంది, ఒంటరిగా అనిపిస్తోంది. తనుంటే బాగుండేది అంటూ దీప్తి సునయనను గుర్తు చేసుకుని ఎమోషనల్(Emotional) అయ్యాడు.
అస్సలు ఉండాలని లేదని, నీ ఫ్రెండ్షిప్, నువ్వు ఏదీ వద్దని అన్నాడు. నాకు నువ్వు అక్కర్లేదు, వెళ్లిపో అనడంతో సిరి ఏడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని తల గోడకేసి కొట్టుకుంది. దీంతో భయపడ్డ షన్నుతల బాదుకోకు, డోర్ తీయంటూ వేడుకున్నాడు. కంగారుపడిపోయిన కంటెస్టెంట్లు బాత్రూం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. రవి డోర్ బాదడంతో ఏడుస్తూనే డోర్ తీసింది. వెంటనే షణ్ను ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.
మొత్తంగా చెప్పాలంటే వీళ్ళ గొడవలు పెద్ద డ్రామానే తలపిస్తునట్టుంది. బిగ్ హౌస్(Big Boss) లో గేమ్ ఆడకుండా ఎమోషనల్ గా గేమ్ ఆడుతున్నారనిపిస్తుంది. కాసేపు బాగానే వుంటారు, వెంటనే గొడవలు పడతారు. షన్ను ఏమో దీపు ని తలుచుకుని ఏడుస్తాడు, సిరి ఏమో బాత్రూమ్లోకి వెళ్లి తలా బాదుకుంటుంది ఏంటో వీళ్ళ డ్రామాలు.
హౌస్ లో అందరు గేమ్ ఆడుతుంటే వీళ్ళు మాత్రం మా రూట్ వేరు అన్నట్టు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఏ డ్రామాలు తేలాలంటే వీకెండ్ హోస్ట్(Host) నాగ్ సర్ రావాల్సిందే.
ఇక బుధవారం ప్రోమో(Promo)లో సన్నీ రవి ల మధ్య రచ్చ జరుగుతున్నట్టు చూపించారు, అలాగే టాస్క్(Task) ఆడను అని తేల్చిచెపినట్టు చూపించారు…