బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) లో వింత వింత గా ప్రవర్తిస్తున్న కంటెస్టెంట్స్(Contestants). వారం మొదలైనప్పటి నుంచి ప్రియా సన్నీ తో కయ్యానికి కాలు దవుతూనే వుంది.
మరి ఏమైందో ఏమో నిన్నటి ఎపిసోడ్ లో సన్నీ తో వున్న గొడవను సదుమనిగించడానికి తెగ ట్రై చేస్తోంది.
ఇక సీక్రెట్ రూమ్ లో వున్నా లోబో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మా రూటే వేరు అంటూ ఒకే ఆట ఒకే మాట గా వుండే సిరి, జెస్సీ, షన్ను ల మధ్య సీక్రెట్ టాస్క్ ఇచ్చి గొడవపెట్టిన బిగ్ బాస్.
కెప్టెన్సీ (Captaincy) టాస్క్ లో షన్ను కి జరిగిన నష్టానికి సిరి, జెస్సీ లదే బాధ్యత అంటూ అలిగిన షన్ను.
నిన్నటి ఎపిసోడ్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి అవేంటో ఇక్కడ చూద్దాం.
మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చిన బిగ్ బాస్(Big Boss). బంగారు కోడిపెట్ట అనే టాస్కును పూర్తి అయ్యిందని ప్రకటించిన బిగ్ బాస్.
అందులో ఎక్కువగా గుడ్లు సంపాదించి విశ్వ, మానస్, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు కెప్టెన్సీ పోటీలకు ఎంపికయ్యారు.
ఇక సీక్రెట్ టాస్కును సరిగ్గా అర్థం చేసుకోలేని జెస్సీ దారుణంగా దెబ్బతిన్నాడు. ముగ్గురి దగ్గర ఎగ్స్ ను జీరో చేయాల్సివుండగా, జెస్సీ మాత్రం ఆట ఆడకుండా వారిని రిక్వెస్ట్ చేసుకుని గుడ్లు లేకుండా చేసాడు.
అలా ఆట ఆడుకుండా వారిని బతిమాలాడి ఒప్పించడంతో సీక్రెట్ టాస్క్(Secret Task) ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేదని జెస్సీని కెప్టెన్సీ(Captaincy) పోటీకి అనర్హుడి అయ్యాడు.
కెప్టెన్సీ పోటీదారుల కోసం హౌస్ మేట్స్(House mates) కి బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా మానస్‌కు స్పెషల్ పవర్(Special Power) ఉన్న ఒక రెడ్ కలర్ గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశం లభించింది. దానికి కోసం ‘స్పైసీ నూడుల్స్ తిను’అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్(Big Boss).
మానస్‌తో పట్టు తాను ఎంచుకున్న మరో వ్యక్తి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఈ గేమ్ కోసం మానస్ సన్నీని ఎంచుకున్నాడు. ఇద్దరూ కారం ఎక్కువగా ఉన్న నూడూల్స్ తిన్నారు. అయితే మానస్ కంటే సన్నీ కొంచెం ఎక్కువగా తిని ఐదు గుడ్లను సొంతం చేసుకున్నాడు.
జెస్సీ కోసం టాస్క్ లో మొత్తానికి షన్ను జీరో అయిపోయాడు. సిరి తన ఆటను కూడా పక్కన పెట్టి మరి జెస్సీ ని గెలిపించడానికి బాగా కష్టపెట్టింది. కానీ జెస్సీ సీక్రెట్ టాస్క్(Secret Task) పోయింది.
ఇద్దరూ కలిసి తనను ఎదవను చేసారంటూ షన్ను ఫీలయ్యాడు. ఫ్రెండ్ అనుకుని నన్ను ఎదవను చేశారు నేను దేనికి పనికి రాను ఆట ఆడటం రాదు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.
ఇంట్లో అందరూ అలానే చూస్తున్నారు. బయటకు వెళ్లాక కూడా అందరూ అదే అంటారు అని షన్ను బాధపడ్డాడు. ఇక సిరి నచ్చచెప్పే ప్రయత్నం చేసిన షన్ను వినలేదు. దింతో ఫీల్ అయినా సిరి కన్నీళ్లు పెట్టుకుంది.
షన్ను అన్న మాటలకు జెస్సీ కూడా ఫీల్ అయినట్టున్నాడు. షన్ను పక్కన ఉన్న బెడ్‌ను ఖాళీ చేసి వేరే బెడ్‌ను వెతుక్కున్నాడు. ఇక లోబో ఇంట్లోకి రావడంతో హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు.
లోబో ఎంట్రీతో శ్రీరామచంద్రకు బ్లాక్ ఎగ్ ఇచ్చి కెప్టెన్సీ పోటీల్లోంచి తప్పించాడు. కాజల్‌కు గోల్డ్ ఎగ్ ఇచ్చి శ్రీరామచంద్ర స్థానంలో కెప్టెన్సీ(Captaincy) పోటీదారునిగా ఎంపిక చేసేసాడు.
సీక్రెట్ టాస్కు (Secret task) లో భాగంగా తనను ఒంటరిని చేయడంపై షన్ను బాధపడ్డాడు. ఈ టాస్క్ వల్ల నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావో నాకు తెలిసిందంటూ సిరి మీద నిప్పులు చెలరేగాడు .
నీలాగా నటించడం రాదంటూ సిరిని హర్ట్ చేశాడు. నన్ను ఇంకా ఇంకా కిందకి లాగుతున్నారు. ఇద్దరి మీద నమ్మకం పోయిందంటూ తన కోపాన్ని చూపెట్టాడు.
ఇక ఉదయాన్నే కాఫీ ఇచ్చినా తాగలేదు. మధ్యాహ్నం లంచ్ ఇచ్చినా తినలేదు. నువ్వు తినమంటే అసలు తినను. నువ్వు నాకు చెప్పకు. నాకు ఆకలైతే నేను తింటాను అని సిరిని తన మాటలతో పదే పదే బాధపెట్టాడు .
మొత్తానికి షన్ను అలక నుంచి ఎప్పుడు బయటకి వస్తాడో చూడాలి. కానీ సిరి మాత్రం షన్ను కి నచ్చచెప్పే ప్రయత్నం మాత్రం ఆపట్లేదు.
మరో పక్క ప్రియా సన్నీ తో వున్నా గొడవను క్లియర్ చేసుకుపోవడానికి తెగ ట్రై చేస్తోంది.
సన్నీ ప్లేట్ లో తినడం. సన్నీ నాతో మాట్లాడడటం లేదని హౌస్ మేట్స్(House Mates) తో చెప్పడం, ఇక సన్నీ కెప్టెన్(Captain) అయితే నేనే రేషనల్ మేనేజర్(RM) గ ఉండాలని అప్పుడాయన మాట్లాడకపోతాడా అంటూ, మాట్లాడడానికి ట్రై చేసింది.
ఇక సీక్రెట్ రూమ్ నుంచి హౌస్ మేట్స్(House mates) ఆట తీరును గమనించిన లోబో. అందరి గేమ్ ని రవి తో షేర్ చేసుకున్నాడు. దీనితో రెచ్చిపోయిన రవి మంచి ప్లాన్ వేసాడు. విశ్వ, శ్రీరామ్, యాని, లోబో లతో కలసి గేమ్ ఆడాలని, టాప్ 5 లో మనమే ఉండాలని చెప్పాడు.
నాకు బుద్ది బలం, విశ్వకి కండబలం, లోబోకి రెండు ఉన్నాయని, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎలా ఉంటుందో ఇకపై చూపిద్దామని కొత్త ఉత్సాహం తో ఊగిపోయాడు రవి.