బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) స్టార్ట్ అయ్యి అప్పుడే వారం రోజులైంది. హౌస్ మేట్స్ (House mates) ఆడియెన్స్ (Audience) ని బాగానే ఎంటర్టైన్(Entertain) చేస్తున్నారు.
ఈ సీజన్ లో హౌస్ మేట్స్ (House mates) ఒక్కరికి మించి ఒక్కరు తమదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు.
ఇక తొలి వారం నామినేషన్(Nomination) లో ఆరుగురు కంటెస్టెంట్స్ లో రవి ,హమీదాలు శనివారం ఎపిసోడ్ లో సేఫ్ అయ్యారు, ఇక అదివారం ఎపిసోడ్ లో జెస్సి, మానస్, కాజల్ సేఫ్ జోన్ లో ఉండగా, సరయు ఎలిమినేట్ అయ్యింది.
ఇందులో భాగం గా ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ముందు హౌస్ మేట్స్ తో నాగ్ ఎంటెర్టైన్మ్నెట్ ప్రోగ్రాం తో మొదలెట్టారు.
హౌస్ మేట్స్ తో రాంప్ వాక్(Ramp Walk) చేయించిన నాగ్, హౌస్ మేట్స్ జంటలుగా విడిపోయి ర్యాంప్ వాక్ చేశారు. వీరికి జెస్సీ, నాగ్ మార్కులు వేశారు. అయితే లోబో, ఉమాదేవి ర్యాంప్ వాక్ తో నవ్వించారు.
రవి, హమీదా.. జెస్సీ, యానీ మాస్టర్ల కుర్చీ గొడవను గుర్తు చేస్తూ కామెడీ చేశారు. శ్రీరామచంద్ర దొరికిందే ఛాన్స్ అనుకుని సిరిని ఎత్తుకుని తిప్పాడు. మిగతావాళ్లందరూ కూడా తమతమ స్టైల్లో ర్యాంప్ వాక్ చేసి అలరించారు.
ఈ ర్యాంప్ వాక్ లో శ్వేతా, ప్రియాంక ఫుల్ మర్క్స్ కొట్టేసారు. తరువాత మానస్ సేఫ్(safe) అయ్యాడని నాగ్ ప్రకటించారు.
తరువాత హౌస్ మేట్స్ తో మరో టాస్క్(Task) ఆడించిన నాగార్జున. నేను నీకు తెలుసా ? అనే టాస్క్ తో హౌస్ 9 జంటలు గా ఈ టాస్క్ లో పార్టిసిపేట్(Participate) చేసారు.
ఈ టాస్క్ లో మొదట సిరి, జెస్సి జంటగా రాగా, జెస్సీని నువ్వెందుకంత ఓవర్ చేస్తావని సిరి అడగగా, అతడు మాత్రం ఎందుకింత త్వరగా ఎంగేజ్ అయ్యావని తిరిగి ప్రశ్నించాడు. దీనితో షాక్ అయినా సిరి నువ్వు వస్తావని తేలిక అని సమాధానమిచ్చింది.
సిరి అసలు పేరేంటని నాగ్ ప్రశ్నించగా శిరీష హన్మంత్ అని సరైన సమాధానం చెప్పాడు జెస్సీ. తర్వాత ఉమాకు రౌడీ రంగమ్మ పాత్ర సూటవుతుందని సరయూ,. సరయూకు అందరిని అర్జునరెడ్డిల మార్చేస్తుందని ఉమాదేవి చెప్పింది.
ఇక షణ్ముఖ్, విశ్వ ల వంతు రాగా , షణ్ముఖ్ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడని ప్రశ్నించాడు నాగ్, దీనికి విశ్వ దీప్తి సునయన పేరు చెప్పాడు.
హౌస్మేట్స్ (house mates )లో ఎవరి గురించి? అని నొక్కి ప్రశ్నించడంతో వెంటనే సిరి అని బదులిచ్చాడు. విశ్వ లోబోను ఎత్తుకోగలవా అని అడుగగా అతడు ఏకంగా లోబోను ఎత్తుకునే చూపించాడు.
షణ్ముఖ్ చేయి మీద ఏమని టాటూ ఉంటుందని అడగ్గా విశ్వ, డి (D) అనే అక్షరం ఉంటుందని కరెక్ట్ గా సమాధానం చెప్పాడు.
ప్రియాంక క్రష్ ఎవరని మానస్‌ను అడగ్గా, శ్రీరామచంద్ర పేరు చెప్పాడు. ప్రియాంకను చేసుకునేవాడికి ఎక్కుగా ఏం ఉండాలి? అన్నదానికి ఓపిక, కేరింగ్, అని చెప్పాడు మానస్. ఇలా అన్ని జంటల ను ప్రశ్నలడిగాడు బుక్ చేసాడు.
ఆ తర్వాత లోబో.. ఇంట్లో వాళ్లకు ముద్దుపేర్లు పెట్టమని చెప్పిన నాగ్ . రవికి-మిల్క్‌బాయ్, శ్వేత-టామ్ బాయ్, సన్నీ-చాక్లెట్, యానీ మాస్టర్-అమ్మ,మానస్-హ్యాండసమ్గయ్, ప్రియాంక సింగ్-బ్యూటిఫుల్, కాజల్-ఎలుక, సరయూ-తొండ, నటరాజ్-బావ, ప్రియ-క్వీన్, విశ్వ-చపాతీ, షణ్ముఖ్-డార్లింగ్, శ్రీరామచంద్ర-మూడీగయ్,హమీదా-ఎరోప్లేన్,, సిరి-సీతాకోక చిలుక, జెస్సీ-పిల్లి అని చెప్పాడు. లహరి, ఉమాదేవికి మాత్రం తాను ముద్దుపేర్లు పెట్టలేనని దండం పెట్టేసాడు. ఈ టాస్క్ తరువాత కాజల్ సేఫ్ అయింది.
తర్వాత నామినేషన్ (Nomination)లో ఉన్న సరయు, జెస్సిలకు చెరో సైకిల్ (cycle) ఇచ్చాడు బిగ్‌బాస్. వీరిలో ఎవరి సైకిల్‌కు లైట్ వెలుగుతుందో వారు సేఫ్(safe) అయినట్లని చెప్తూ వారిని టెన్షన్ పెట్టించాడు. కొద్ది క్షణాల తరువాత జెస్సీ సైకిల్ బల్బ్ వెలగడంతో అతడు సేఫ్ అని నాగ్ ప్రకటించాడు. సరయూ ఎలిమినేట్ అయిందని వెల్లడించాడు.
ఇది తట్టుకోలేకపోయిన విశ్వ హౌస్ లోపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు.
అటు హమీదాను ఆపడం కూడా ఎవరి తరమూ కాలేదు. ఇక బోల్డ్ గ వుండే సరయూ చివరిసారిగా విశ్వను చూడగానే పట్టుకుని గట్టిగా ఏడ్చేసి అందరికి బాయ్ చెప్పి హౌస్ లో నుంచి బయటకు వెళ్ళింది.
నిజానికి చెప్పాలంటే అందరు జెస్సినే ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే, సరయు ని ఎలిమినేట్ చేసి అందరిని షాక్ కి గురిచేసారు బిగ్ బాస్. మరి ఇది ఆడియెన్స్ ఇచ్చిన వోటింగ్ ద్వారా ఎలిమినేట్ చేసారో, లేక బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయమో స్పష్టత లేదు.మొత్తానికి మొదటి వారం ఎలిమినేషన్ అయితే షాక్ అనే చెప్పాలి.
మరి సోమవారం నామినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోందో .