విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన తాజా తెలుగు చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ (OTT) అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి ఈ చిత్రం ఎలా ఉందో ,రివ్యూ (Review) తెలుసుకుందామా …
ఈ చిత్రం విషయాలకు వెళ్తే
నటీనటులు :
విక్టరీ వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేష్,నాజర్, రాజీవ్ కనకాల తదితరులు
నిర్మాతలు : ఎస్. థాను, దగ్గుబాటి సురేష్‌బాబు
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల
సంగీత దర్శకుడు : మణిశర్మ
రీమేక్ కథలు (remake stories) తెరకెక్కించడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. నటీ నటులకు కు, తెరకెక్కించే దర్శకుడికి,సినీ బృందానికి అది నిజంగా పెద్ద కత్తి మీద సాము వంటిది అనే చెప్పాలి .
కథలోని మూలం ఏమాత్రం చెడి పోకుండా రీమేక్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకోవడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.
అయితే రీమేక్ చేసినా కూడా ఆ చిత్రం పోలికలు ఏ మాత్రం పడకుండా,కథ లో నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడే హీరో విక్టరీ వెంకటేశ్ ఇప్పుడు నారప్ప సినిమా (తమిళంలో అసురన్) లో మన ముందుకు గా వచ్చారు.
ఈ చిత్రం నేడు (జూలై 20) అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో విడుదలైంది.
కథ
ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం రామసాగరం అనే ఊరిలో సాగుతుంది.
తన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూస్వామి పాండుసామి (నరేన్) మొత్తం ఊరిలో అందరి భూమిని లాక్కోవాలని చూస్తుంటాడు.
అయితే నారప్ప (వెంకటేష్)కు చెందిన మూడు ఎకరాలు తప్ప ఊర్లోని అందరి పొలాలు కూడా పాండుసామి సొంతం చేసుకుంటాడు .
నారప్ప మాత్రం ఒక తాగుబోతులా ఏది పట్టించుకోకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
అతని పెద్ద కొడుకు ముని ఖన్నా (కార్తీక్ రత్నం) బాగా ఆవేశ పరుడుగా ఉంటాడు.. అతను ఒక్కడే పాండుసామికి ఎదురు తిరుగుతాడు.
ఈ తగాదాల్లో ముని ఖన్నాను పాండుసామి చంపేస్తాడు. అప్పుడు కూడా నారప్పలో ఏమాత్రం చలనం రాదు.
నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) తన కొడుకు న్యాయం అడిగితే వాడిని అన్యాయం గా చంపేశారు అని తరచూ బాధపడుతూనే ఉంటుంది.
ఒక రోజు తన తల్లి బాధను చూడలేక చిన్న కొడుకు సిన్నబ్బ (రాఖీ) సడన్ గా పాండుసామిని చంపేస్తాడు.
ఇప్పుడు తన రెండో కొడుకును కాపాడుకోవాలని నారప్ప చేసే ప్రయత్నాలు,అసలు నారప్ప ఎందుకు తాగుబోతుగా, ఏమీ చేతగాని వాడిలా అందరి ముందు నిల్చుంటాడు? అసలు నారప్ప గతం ఏంటి?
చిట్ట చివరకు నారప్ప తన కొడుకును కాపాడుకున్నాడా? లేదా? ఇదే ఈ చిత్రం కథ.
ప్లస్ పాయింట్స్ (Plus points) :
నారప్పగా విక్టరీ వెంకటేష్ చాలా అద్భుతంగా నటించారు.
ఎమోషనల్ (Emottional) గా సాగే రెండు వేరియేషన్స్ పాత్రలో వెంకటేష్ రియలిస్టిక్ గా నటించారు అనే చెప్పాలి.
మెయిన్ గా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ లో మరి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.
అంతే కాకుండా ఆయన డైలాగ్స్ పలికిన విధానం కూడా ప్రేక్షకులని భావోద్వేగానికి గురిచేసే ఫీలింగ్ కలుగుతుంది.
మెయిన్ గా కొడుకు చనిపోయిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ లో, అలాగే ఇంటర్వెల్ లో చేత కాని తండ్రి నారప్పగా మారి చిన్న కొడుకుని కాపాడుకునే సీక్వెన్స్ లో, చిట్ట చివర క్లైమాక్స్ సీన్ లో వెంకటేష్ పాత్రలో జీవించారు.
అటు నారప్ప భార్యగా ప్రియమణి కూడా చాలా న్యాచురల్ (Natural) గా నటించి పాత్రకి బలం చేకూర్చింది.
నారప్ప కొడుకుగా కార్తీక్ రత్నం, మిగిలిన పాత్రల్లో నటించిన రావురమేష్, నాజర్,రాజీవ్ కనకాల వంటి నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టు బాగా నటించారు.
అంతే కాకుండా మాస్ ఎలిమెంట్స్ తో సాగే ఎమోషన్స్ కూడా బాగా కుదిరాయి. దీనికి తోడు బలమైన యాక్షన్ సీక్వెన్స్ కి అంతే బలమైన రీజన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ చిత్రం ప్రేక్షకులని బాగా మెప్పిస్తుంది.
మొత్తం మీద ఈ చిత్రం లో మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు అన్ని చాలా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ (Minus Points) :
నారప్ప పక్కా యాక్షన్ తో సాగే పర్ఫెక్ట్ ఎమోషనల్ డ్రామా మూవీ అయినప్పటికీ నారప్ప స్లోగా ఉండటం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ .
పైగా మరి కొన్ని సీన్స్ చాలా రెగ్యులర్ (regular) గా ఉన్న ఫీలింగ్ కలుతాయి.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల అయితే రంగస్థలం సినిమాలోని కొన్ని సీన్స్ పోలి ఉండటం కూడా ఈ సినిమాకి ఒక మైనసే.
అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ను ఇంకొంచెం బాగా రాయొచ్చు.
ఇక ఫ్లాష్ బ్యాక్ బాగున్నా… ప్లాష్ బ్యాక్ లో నాజర్ పక్కన విలన్ రోల్ ను ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేంది. ఆ పాత్ర పూర్తి సినిమాటిక్ గా ఉంది.
అలాగే స్క్రిప్ట్ లో కొంత తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేసిన మార్పుల్లో కొన్ని బాగాలేదు అనే చెప్పాలి.
ఓవరాల్ గా అయితే సినిమాలో కొన్ని చోట్ల ఇంకొంచెం బెటర్ గా ఉండి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలిగినప్పటికీ నారప్ప పాత్రలో వెంకటేష్ అవి అన్ని కవర్ చేసి ప్రేక్షకులని తన నటన సామర్థ్యం తో అకట్టేసుకున్నారు అనే చెప్పాలి .
ఇక సంగీతం ,మణిశర్మ అందించిన పాటలు (Songs super) సూపర్ గా ఉన్నాయి.
శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది.
మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.
మొత్తం మీద విక్టరీ వెంకటేష్ పెర్ఫార్మన్స్ తో నారప్ప తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యేలా ఉంది .
అసురన్ చూడకుండా నేరుగా నారప్పను చూసే ప్రేక్షకులకి మరింత కొత్త అనుభూతి కలుగుతుంది .
చివరగా : నారప్ప.. నువ్వు అదరగొట్టేసావప్ప… నారప్ప గా విక్టరీ వెంకటేష్ సూపర్ ….
ఇక ఆలస్యం ఎందుకు అమెజాన్ ప్రైమ్ లో నారప్పను చూసేయండి …