మనం అందరం పొద్దున లేస్తే గుడ్ మార్నింగ్ మెసేజ్ తో మొదలు పెట్టి ,గుడ్ నైట్ వరకు వాడేది ఏంటి ??
వాట్సాప్ (Whatsapp) .. అంతే కదా !!
యువత దగ్గర నుండి ,ముసలి వారు వరకు వాట్సాప్ (whatsapp) వాడడం అనేది సర్వ సాధారణం అయిపొయింది నేటి రోజుల్లో …
కొన్ని అధ్యయనాల ప్రకారం వాట్సాప్ (whatsapp voice calls) వాయిస్ కాల్స్ కోసం నిమిషానికి 740 Kb ల డేటా ఉపయోగిస్తుంది.
మరి వాట్సాప్ లో డేటా వినియోగాన్ని తగ్గించడం ఎలాగో తెలుసుకుందామా !!
- మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న (Top corner) మూడు నిలువు చుక్కలపై నొక్కండి.
- ఇప్పుడు సెట్టింగులకు (settings) వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.
- ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే (option)ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.
- అదేవిధంగా వైఫై (Wi-Fi) లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ (Roming )చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం (repeat )చేయండి.దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు (Settings) వెళ్ళాలి.
- ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి (Data and storage) వినియోగంపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన (Uncheck)ఎంపికను తీసివేయండి.
ఇలా చేయడం వల్ల డేటా అనేది సేవ్ అయ్యి యుసేజ్ (usage) ఎక్కువ సేపు వస్తుంది ..
బాగుంది కదా ఈ వాట్సాప్ డేటా సేవ్..
మరి ఇక ఆలస్యం ఎందుకు
ఈరోజే మీ మొబైల్ లో ట్రై చేయండి .. ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రులందిరికీ షేర్ చేసేయండి…