రెండు తరాల క్రితం వరకు ఫోటో అంటే ఒక సౌకర్యం, కానీ నేడు అది అతి సాధారణం. బ్లాకు అండ్ వైట్ ఫోటోల నుండి ఈ నాడు 360o కెమెరా వరకు ఫోటో ప్రయాణం చాలా చిత్రoగా సాగింది. ప్రస్తుతం మనం ఈ 360o కెమెరా కాలంలో ఉన్నాం. అది కూడా ఎక్కువ లేవు చాలా తక్కువ సంస్థలు ఈ 360o కెమెరాను అందిస్తున్నాయి. ఒకప్పుడు డిజిటల్ కెమెరాలను ఇష్ట పడే వారందరూ ఇప్పుడు ఈ 360o కెమెరాకు మారే సమయం ఆసన్నమయింది. పేరుకు తగ్గట్టే ఇది ఒక చిత్రం లేదా వీడియోను అన్ని కోణాల నుండి తీయగలగటం ఈ కెమెరాల ప్రత్యేకత. సరే, ఇప్పుడు ఈ Rylo ఎందుకు ప్రత్యేకమైనదో ఇప్పుడు చెప్పుకుందాం.
ముందుగా ఇది మన అర చేతిలో పట్టే 360౦ కెమెరా. దీని బరువు కేవలం 100 గ్రా. ఇక దీనిలో 4K పిక్చర్ క్వాలిటీ, కలిగి HD ఫోటోలు, వీడియోలు తీస్తుంది. దీనిలో కేవలం రెండే రరెండు బటన్లు ఉంటాయి, ఒకటి ఫోటో కోసం, రెండవది వీడియో ఆన్/ఆఫ్ కోసం. ఈ కెమెరా లోపల ఉన్న రెండు సెన్సార్లు 4K ఫోటోలు/వీడియోలు తీస్తుంది. ఇంకా దీనితో తీసిన photoలు సేవ్ చేయడానికి 16 GB SD కార్డు కూడా కలిగి 256 GB వరకు మెమరీ ని పొడిగించుకోవచ్చు. ఈ కెమెరా కున్న మరో ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఒక వ్యక్తి/వస్తువును ఫోకల్ పాయింట్ గా పెట్టుకుంటే, ఈ కెమెరా దానినే బిందు స్థానంగా వారి చుట్టూ ఫోటో/వీడియో తీస్తుంది.
పైన చెప్పినవి Rylo లోని ఫీచర్లు అయితే ఈ కెమెరాను మిగతా 360 కెమెరాల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేవి రెండు – 1. ఎడిటింగ్ 2. ధర. అవును ఈ కెమెరా ద్వారా తీసిన వీడియోలను మన స్మార్ట్ ఫోన్ లేనే ఎడిట్ చేసుకుని facebook/instagram లకు అప్లోడ్ చేసుకోవచ్చు. అవును ఈ ఫీచర్ మరే ఇతర 360 కెమెరాలకు లేదు. అయితే ఇలా ఎడిట్ చేసుకోవడానికి ఈ Rylo యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. కొద్ది కాలం క్రితం వరకు ఈ ఎడిటింగ్ కేవలం ఇఫోన్ లకు మాత్రమే అనుమంతించారు, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా ఈ సౌకర్యం కల్పించారు. అయితే అందుకు మరీ పాత ఆండ్రాయిడ్ ఫోన్లు కాకుండా Samsung galaxy లేటెస్ట్ వెర్షన్ లేదా గూగుల్ pixel ఫోన్లలో నేరుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కనీసం ఆండ్రాయిడ్ marshmallow 6.0 హార్డువేర్ ఫోన్లో కలిగి ఉండాలి. ఇక దీని ధర $499 మాత్రమే. ఇది ఈ కెమెరా అందించే ఫీచర్లకు మిగతా 360 కెమెరాలతో పోల్చితే తక్కువే అని చెప్పాలి.
మరింకేం photoలు వీడియోలు అంటే మోజున్న వారికి ఈ కెమెరా ఖచ్చితంగా ఉండాల్సిన పరికరమే ఏమంటారు.