ప్రస్తుత కాలంలో బాగా మొండి జబ్బులు అంటే HIV, కాన్సర్, ఎబోలా ఇలా ఉన్నాయి వాటి పేర్లు. ఇందులో అధిక భాగం వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఆ వ్యాధిని కూడా ఆ వైరస్ పేరుతో వ్యవహరిస్తున్నారు. సరే, మన దేశంలో అంతకంతకూ ఈ ఎయిడ్స్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. ఈ వ్యాధి ఎప్పుడో ముదిరిన తరువాత కంటే ఆదిలోనే కనిపెట్టగలిగితే దీనికి చికిత్స సాధ్యం అవుతుంది. ఇంతవరకూ కూడా ఏ దేశంలోను ఈ వ్యాధిని ముందుగా కనిపెట్టలేకపోతున్నారు. అందువల్ల ఈ వ్యాధికి నివారణే మందు అని ప్రచారం చేస్తున్నారు. సరే, ఇటువంటి మొండి వ్యాధుల అంతు చూడడానికే కదా పరిశోధకుల ప్రయత్నాలు. అలా London లోని Imperial College of London పరిశోధకులు ఈ జబ్బును ఆదిలోనే కనిపెట్టడానికి ఒక సులభమైన డయాగ్నొస్టిక్ టెస్ట్ ను రూపొందించారు.
ఇది అత్యంత తేలిక, చౌకైనది కావడం విశేషం. ఈ డయాగ్నొస్టిక్ టెస్ట్ టూల్ మనం చూసే pregnancy test మాదిరి ఉంటుంది. ఆ విధంగా విరివిగా లభించేలా చేయడం పరిశోధకుల లక్ష్యం.ఇక ఈ tool ను వైద్య పరిభాషలో lateral flow immunoassay అని అంటారు. ఈ పరీక్ష అత్యంత స్వల్పంగా శరీరంలో ఈ virus ఉన్నా కనిపెట్టే విధంగా (sensitivity) తయారు చేసారు. ఈ virus కనుక శరీరంలో ఉంటే ఆ డయాగ్నొస్టిక్ టెస్ట్ పేపర్ రంగు మారుతుంది. ఇక ఈ టెస్ట్ శరీరంలో HIV ని సూచించే biomarker ఆధారంగా జరుగుతుంది. ఈ HIV వైరస్ పై భాగంలో ఉండే p24 అనే ప్రోటీన్ ను biomarker గా తీసుకున్నారు. ఈ p24 కొన్ని రసాయనాల కలయికతో రంగు మారడం చేత గుర్తించవచ్చు.
అలా ఈ HIV Detection with a paper based test ను అత్యంత సమర్ధవంతంగా స్వల్పంగా శరీరంలో ఉన్నా దానిని 100 రెట్లు మేర దాని ఉనికిని ఈ test ద్వారా బహిర్గతం చేస్తుంది.
ప్రస్తుతానికి ప్రపంచంలో HIV ని చాలా ముందుగా, అత్యంత సులభంగా, చౌకగా గుర్తించగల డయాగ్నొస్టిక్ టెస్ట్ ఇదే. ఈ పరిశోధన ACS Nano అనే జర్నల్ లో ప్రచురించబడింది. అయితే ఇది అందరికీ అందుబాటులోకి రావాలంటే దానికి ప్రభుత్వం మరియు ఫార్మా సంస్థల సహకారం అవసరం. ఏది ఇది మరి కొద్ది సంవత్సరాల్లో అందరికీ అందుబాటులోకి రావచ్చు.