ఏటా పెరుగుతున్న సాంకేతికతను ఒక్క చోట చేర్చి ఆశ్చర్యం కలిగించే పరికరాలను ఒక్క చోటే చూసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచన ఇప్పుడు కాదు యాభై ఏళ్ల క్రితమే వచ్చింది అమెరికాకు. అందుకే ఏటా ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నిపుణత కలిగిన సంస్థలు తాము ఏడాదిలో విడుదల చేయబోయే పరిజ్ఞ్యానాన్ని ఒక చోట ప్రదర్శిస్తారు. అదే ఈ అమెరికా లోని లాస్ వేగాస్ లో జరుగుతున్న CES 2017 show. ఈ సంవత్సరం 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ కార్యక్రమoలో Sony, Samsung, LG, Apple, ఇలా పేరున్న సంస్థలు ఇంకా అప్పుడే మార్కెట్లోకి అడుగుపెడుతున్న సంస్థలు సైతం పోటీ పడ్డాయి. ఈ పోటీలో సరికొత్త టీవీలు, డ్రోన్లు, కంప్యూటర్లు, కార్లు, ఇలా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో కొన్ని మచ్చుతునకులు చూద్దాం.
Intel వారి క్రెడిట్ కార్డు కంప్యూటర్: ఇప్పటికీ మనం కంప్యూటర్ లేదా లాప్టాప్ లో సరికొత్త OS లను అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. మనం ఉన్నదానిని అప్గ్రేడ్ చేస్తుంటే, కంపూటర్ల తయారీ సంస్థ Intel మనకంటే ఎన్నో అడుగులు ముందుకేసి, క్రెడిట్ కార్డు అంత పరిమాణంలో ఒక కంప్యూటర్ ను తయారు చేసింది. ఇది ఎందుకు అంటే భవిష్యత్తులో మన ఇంట్లోని ఏదైనా వస్తువు అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు కేవలం ఆ వస్తువు లో దీనిని పెడితే చాలు డాని పని తీరే మారిపోతుంది. అంటే సాధారణ రెఫ్రిజిరేటర్ ను స్మార్ట్ రెఫ్రిజిరేటర్ గా, సెక్యూరిటీ కెమెరా సిస్టం మొదలైన వాటిని అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఈ మొత్తం వస్తువును మార్చకుండా కేవలం ఈ క్రెడిట్ కార్డు కంప్యూటర్ తో పని చేయబడుతుంది.
PowerRay Aquatic Drone: డ్రోన్ లు ఇప్పుడు గాలిలోనే కాదు నీటిలోనూ వెళ్ళగలవు. PowerVision సంస్థ వారి ఈ డ్రోన్, సోనార్ సిస్టం తో పని చేస్తుంది. అంతే కాదు ఇది నీటిలో చేపలను సైతం కనిపెట్టి వాటి ఫోటోలను 12 MP కెమెరా తో ఫోటోలు తీసి యూసర్ కు పంపిస్తుంది. ఇది నదులు, సముద్రపు నీటిలో కూడా పనిచేయగలగడం విశేషం.
ASUS Zenfone AR: ఇకపైన ఫోన్లలో వీడియో చాట్, వీడియో గేమ్స్, మ్యూజిక్, apps మొదలైనవన్నీ పాతబడిపోతాయి. ఇక పైన VR (Virtual Reality) మరియు AR (Augmented Reality) కోసం ఫోన్లను వాడే రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఈ సంస్థ పెద్ద VR మరియు AR సిస్టం లను ఈ Zenfone లో అమర్చింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే దీన్లో Tango, Daydream అనే సాంకేతికత కలిగి ఇవి VR, AR apps కు సహకరిస్తాయి. అంటే ఈ సాంకేతికత మన చుట్టూ ఉన్న పరిసరాలను, గమనించి ఆ విధంగా VR, AR గేమ్స్ ఆడడానికి ఉపయోగపడుతుంది అన్న మాట.
LG OLED vs Samsung QLED:
టీవిలలో ఈ సంవత్సరం పై రెండు సంస్థలు పోటా పోటీ పడుతున్నాయి. LG సంస్థ 77 అంగుళాల W-సిరీస్ అంటే Wallpaper సిరీస్ ను విడుదల చేసింది. అంటే ఈ టీవి ఒక పలుచని పేపర్ మాదిరి గోడకు అంటించుకునే విధంగా ఉండడం దీని ప్రత్యేకత. ఈ టీవీలు OLED (Organic Light Emitting Diode) పరిజ్ఞ్యానంతో తయారు చేయబడ్డాయి. ఇక Samsung QLED (Quantum Light Emitting Diode) పరిజ్ఞ్యానంతో తయారైంది. దీని వల్ల పిక్చర్ క్వాలిటీ మరింత అద్భుతంగా ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది.
ఈ షో లో ప్రదర్శించిన మరిన్ని అద్భుతమైన పరికరాలు వాటి విశేషాలతో తిరిగి కలుద్దాం.