ఒకప్పుడు సంగీతం వినడానికి అనువైన సాధనం వాక్ మాన్. ఆ తరువాత సిడి ప్లేయర్, ఎంపి3 ప్లేయర్, ఐపాడ్, సెల్ ఫోన్ ఇలా ఎన్నో వచ్చాయి. సాధనాలు వేరైనా వీటన్నిటిలో ఒక్కటి మాత్రం సర్వ సాధారణం. అవి, వైర్లతో కూడిన హెడ్/ఇయర్ ఫోన్స్. ఈ వైర్లతో కూడిన హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లతో సంభాషణలు కూడా జరిగేవి. అయితే ఈ వైర్లతో ఉండే ఇబ్బంది వల్ల, పరిమితుల వల్ల తర్వాతి కాలంలో బ్లూటూత్ హెడ్ సెట్ వచ్చింది. ఇప్పుడు అది కూడా కాదని, సాoకేతికత మరో అడుగు ముందుకేసి BATBAND గా మన ముందుకొచ్చింది. పేరే విచిత్రంగా ఉంది కదూ. మరి దీని గురించి తెలుసుకుందామా
ఈ BATBAND ను Studio Banana Things అనే సంస్థ తయారు చేసింది. ఇది చూడడానికి ఒక వైర్లెస్ హెడ్ band లా ఉంటుంది. ఇది మొబైల్ కు, లాప్ టాప్ కు బ్లూటూత్ ద్వారా అనుసంధానం చేయబడి పని చేస్తుంది. ఈ BATBAND bone conduction ఆధారంగా పని చేస్తుంది. దీనిలో 3 transducers ఒక మైక్రోఫోన్, ఇంకా టచ్ సెన్సర్స్ ఉన్నాయి. దీనిలోని transducers ఒక ప్రత్యేకమైన frequency గల శబ్ద తరంగాలను విడుదల చేస్తాయి. ఈ తరంగాలు చెవి పైన ఉండే ఎముక భాగం ద్వారా చెవి లోపలి భాగాన్ని చేరుకుంటాయి. అందువల్ల బాహ్య ప్రపంచంలోని శబ్దాలను వినడానికి మన చెవులు ఖాళీగానే ఉండడం దీని ప్రత్యేకత. ఈ transducers చెవికి ఇరువైపులా ఇంకా తల వెనుక భాగంలో ఉన్నాయి. దీన్లో కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే పాటలను వినచ్చు. దీంట్లో ON/OFF బటన్ ఇంకా పాటలను స్కిప్ కూడా చేసుకోవచ్చు.
ఇది పూర్తిగా 6 నుంచి 8 గంటలు నిర్విరామంగా పని చేస్తుంది. దీని ధర $149. ఇది 2017 కల్లా మార్కెట్ లోకి రానుంది.