సంజ్ఞలు (Sign లాంగ్వేజ్). ఇవి ఒక ప్రత్యేకమైన శారీరక లోపం ఉన్న వారి జీవన విధానం. మీకు వెంటనే గుర్తుకు రావాలంటే, ఇటువంటి ప్రత్యేకమైన శారీరక లోపం ఉన్న వారి కోసం ఇది వరకూ దూరదర్శన్ లో మధ్యాహ్న సమయంలో ఈ సంజ్ఞా వార్తలు ప్రసారమయ్యేవి. అందులోని యాంకర్ కేవలం చేతి వేళ్ళ కదలికల ద్వారా మాత్రమే వార్తలను తెలియచెప్పేది. వీటిని అర్ధం చేసుకోవడం మిగతా వారికి చాలా కష్టం. అందువల్ల ఇటువంటి లోపాలు ఉన్న వారు మనతో కలవలేరు, మనలా సాధారణ జీవితాన్ని గడపలేరు. భగవంతుడిచ్చిన లోపాన్ని సవాల్ చేస్తూ వారి చేత మాట్లాడిoచగలిగితే? అవును సాంకేతికత సహాయంతో వారి సంజ్ఞలకు అక్షర, స్వర, రూపాన్ని ఇచ్చింది ఒక విద్యార్ధి. ఆసక్తిని కలిగించే ఆ విశేషాలు మీ కోసం…
University of London కు చెందిన Hadeel Ayoub, ఇటువంటి ప్రత్యేకమైన లోపాలు ఉన్నవారి కోసం ఒక స్మార్ట్ గ్లోవ్ (smart glove) ను తయారు చేసింది. ఈ గ్లోవ్ లోని 5 వేళ్ళకీ flex sensors అమర్చబడి ఉన్నాయి. అలాగే ఈ గ్లోవ్ కు ఒక accelerometer, micro controller board ఇంకా ఒక four digit graphic numerical display అమర్చారు. అంతే కాదు ఈ గ్లోవ్ కు తగ్గట్టు ఒక కంప్యూటర్ programme ను కూడా తయారు చేసింది. ఇవి ఎలా పని చేస్తాయి అంటే, accelerometer చేయి ఎటు తిరుగుతోందో గమనిస్తుంది. అలాగే ఇందులోని సెన్సర్స్ చేయి కదలికలకు ఒక numeric value ని ఇచ్చి ఈ మానిటర్ లో చూపిస్తుంది. ఈ output/values ను వాక్యాలుగా మార్చడానికి ఈ software ను తయారు చేసారు. ఈ గ్లోవ్ ను తయారు చేసే క్రమంలో Hadeel 3 నమూనాలను (Prototypes) ను తయారు చేసింది. ఒకదాన్ని మించి మరొకటి మెరుగైనది. ఈ మూడో Prototype Glove లో text-to-speech chip ను అమర్చారు. దీంతో ఇప్పుడు ఇందులోని software ద్వారా సంజ్ఞలను వాక్యాలుగానే కాకుండా, ఆ వాక్యాలను మాటలుగా మార్చి వినిపిస్తుంది. అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్ భాషలలోనే లభ్యం అవుతుంది. త్వరలోనే ఇది మిగతా భాషలలో కూడా అందుబాటులోకి వస్తుంది అంటోంది Hadeel. దీన్ని ఇంకా మెరుగుపరచడానికి ఈ స్మార్ట్ గ్లోవ్ కు wi-fi, స్పీకర్, LED లైట్, text translator ను ఉపయోగించనున్నారు. అలాగే దీనికి ఒక యాప్ ను రూపొందించి మొబైల్ మరియు tablet లు అనుసంధానం చేయడం ద్వారా ఇటువoటి లోపాలు ఉన్నవారు ప్రపంచంలో ఎవ్వరితోనైనా, ఎలాగైనా సంభాషించగలరు. ఈ స్మార్ట్ గ్లోవ్ ను చిన్న సైజు లో తయారు చేసి పిల్లలకు కూడా అందుబాటులోకి తేవాలని Hadeel యోచిస్తోంది.
స్మార్ట్ గ్లోవ్ కు ఉన్న ఈ సెన్సర్స్ మొదలైనవి కనిపించకుండా ఈ గ్లోవ్ లైనెన్ కింద కుట్టేసారు. అందువల్ల ఇది చూడడానికి సాధారణ గ్లోవ్ లానే కనిపిస్తుంది. దీన్ని తయారు చేసినందుకు Hadeel కు ఈ సంవత్సరం UK లోని Innovation and Entrepreneurship Prize కూడా వచ్చింది. అంతేకాకుండా దీన్ని మార్కెట్లో విడుదల చేయడానికి ఎన్నో కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. ఇంతటి అద్భుతమైన పరికరం ధర సుమారు 255 పౌండ్లు ఉండచ్చు.
Hadeel స్ఫూర్తితో ఇటువంటి మరిన్ని పరికరాలు అందుబాటులోకి వస్తే శారీరక లోపాలు ఉన్న వారి జీవితాలు ఆనందమయం అవుతాయి.