ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్రమైన జ్వరాలతో మనుషులు చనిపోతున్నారు. ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో ఒక పట్టాన అంతు పట్టని విషజ్వరాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కోసారి లక్షణాలు కూడా బాగా ముదిరితే కానీ బయట పడటంలేదు. దాంతో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారు. మొన్న స్వైన్ ఫ్లూ ఇప్పుడు ఎబోలా. ఈ ఎబోలా మొట్ట మొదటి సారిగా 2014 ఆఫ్రికాలో బయట పడింది. ఆఫ్రికాలో కొన్ని వేల మంది ప్రాణాలను ఈ ఎబోలా బలికొoది. ఇది అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. దీనిని ఆదిలోనే గుర్తించి దీని వ్యాప్తిని అడ్డుకోగలిగితే కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడవచ్చు.
ఎబోలా ను వ్యాప్తి చేసేది RNA virus. ప్రస్తుతం ఈ ఎబోలా ను గుర్తించడానికి ఉపయోగించే PCR (Polymerase Chain Reaction) పద్ధతిలో RNA virus నుంచి DNA ను తయారు చేసుకొని దాన్ని రోగి DNA తో మ్యాచ్ చేస్తున్నారు. ఆ విధంగా ఈ ఎబోలా virusను గుర్తిస్తున్నారు. ఇందుకోసం చేసే పరీక్షలకు పెద్ద పెద్ద లాబ్స్ అవసరం. అలాగే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది మరియ ఎంతో సమయం కూడా పడుతుంది. అభివృద్ధి చెందని దేశాల్లోని వారి అవసరాల దృష్ట్యా ఈ సమయాన్ని, ఖర్చును తగ్గించి అందుబాటు ధరలో ఒక పరికరాన్ని తయారు చేయడం కోసం ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
తాజాగా University of California కు చెందిన పరిశోధకులు దీనిని అత్యంత సులభంగా గుర్తించడానికి ఒక chip technology ని తయారు చేసారు. దీనిలో రెండు రకాల చిప్స్ ఉంటాయి. అవి micro fluidic మరియు opto fluidic చిప్స్. ఇందులోని మొదటి చిప్ ద్వారా రోగి నుంచి సేకరించిన శాంపిల్ రెండో చిప్ లోకి వెళుతుంది. దానిలో optical detection ద్వారా nucleic acid లోని ఈ virus ను గుర్తించగలవు. ఇది ఖచ్చితమైన, త్వరితగతిన ఫలితాలను ఇస్తుందని ఈ పరిశోధన బృందం లోని Schimdt అంటున్నారు.
ఈ chip technology ని ఒక పరికరం లా తయారు చేసి అభివృద్ధి చెందని దేశాల్లోని అన్ని వైద్యసాలలకు పంపిణీ చేస్తే దీన్ని త్వరగా గుర్తించి ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు.