ఏ దేశమైనా సరే నానాటికీ హృద్రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది తీవ్రమైన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. కారణాలేమైనా సరే వీరికి తగ్గ వైద్యం చేయించినా అధిక శాతం రోగులకు మరొక గుండె అవసరo అవుతోంది. ఇక ఆ పరిస్థితి ఎదురైతే రోగులైతే ఉన్నారు కానీ గుండెను దానమిచ్చే దాతలు లేరు. అందువల్ల మానవ శరీరంలో సహజంగా ఏర్పడే గుండెను కృత్రిమంగా తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది పరిశోధకులకు.

ఇప్పటికే కొన్ని చోట్ల కృత్రిమంగా గుండెను తయారు చేసే పనిలో ఉన్నారు. కానీ అవి చాలా ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా స్విట్జర్లాండ్ కు చెందిన ETH Zurich పరిశోధక బృందం అతి తక్కువ ఖర్చుతో కృత్రిమంగా గుండెను 3D ప్రింట్ చేసారు. సిలికోన్ తో తయారయ్యే ఈ గుండె అచ్చం మనుషి గుండెలానే పని చేస్తుంది. 3D ప్రింటింగ్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ అవయవాలను కూడా తయారు చేయవచ్చు.

ఈ గుండెలో మనిషి గుండె మాదిరి రెండు కవాటాలు (chambers) ఉన్నాయి. దీనితో పాటు అదనంగా మరో కవాటం (Chamber) గుండె కొట్టుకోవడానికి వీలుగా అమర్చారు. కారణం అది వరకు కృత్రిమ గుండెలకు ఒక పంప్ ను శరీరం బయట నుండి గుండెకు అమర్చేవారు. ఇది గుండెను కొట్టుకునేలా చేస్తుంది. కానీ ఈ 3D ప్రింటెడ్ గుండెలో అమర్చిన మూడో కవాటంలోకి గాలిని ఒక బుడగ మాదిరి పంపిస్తే అది infalte, deflate అవుతూ గుండె లాగా పని చేసి రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఇందుకోసం పరిశోధనలో రక్తం మాదిరి లక్షణాలున్న (Viscosity) ద్రవాన్ని ఉపయోగించారు. ఈ 3D ప్రింటెడ్ గుండె 390 గ్రాముల బరువుండి ఇంచుమించు మానవ గుండె పరిమాణంలో ఉంటుంది.

అయితే ఈ 3D ప్రింటెడ్ గుండె కేవలం 3000 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది అంటున్నారు ఈ బృందంలో ఒకరైన Nicholas Cohr. ఇది కేవలం ఒక నమూనా మాత్రమేనని ఇది గుండెకు ఇంకా ప్రత్యామ్న్యాయం కాదని అంటున్నారు Cohr. కాకపోతే దీనిని మరింత అభివృద్ధి చేసి ఈ దిశలో పయనించడానికి మార్గదర్శిగా నిలుస్తుoదని Cohr అంటున్నారు.

ఈ పరిశోధన Artificial Organs లో ప్రచురించబడింది.

Courtesy