బీటేక్ విద్యార్థులకు శుభవార్త. ప్రముఖ ఐటి సంస్థలలో ఒకటైన విప్రో (WIPRO) నిరుద్యోగుల నుంచి ఉద్యగల భర్తీ కి దరఖాస్తులను కోరుతోంది. ఫ్రెషర్స్ (freshers) ని నియమించేందుకు, ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Elite National Talent Hunt) ద్వారా విప్రో నిర్వహిస్తున్న హైరింగ్ ప్రొగ్రామ్ (hiring program).
బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయచ్చు. ఈ హైరింగ్ ప్రొగ్రామ్ ద్వారా 30,000 మంది ఫ్రెషర్స్ కి ఆఫర్ లెటర్స్ ఇవ్వనుంది విప్రో.
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాలలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం 30,000 ఆఫర్ లెటర్స్ ఇస్తే అందులో 22,000 మంది ఫ్రెషర్స్ ఉద్యోగాలలో చేరుతారని విప్రో అనుకుంటోంది.
అయితే ఇప్పటికే విప్రో లో పనిచేస్తున్న ఉద్యోగాలు ఇతర సంస్థల నుంచి ఆఫర్స్ ని అందుకుని వెళ్తున్నారు. దాంతో ఖాళీలు ఎక్కువగా ఉండడంతో ఈ సమస్యకి చెక్ పెట్టడానికి ఫ్రెషర్స్ ఉద్యోగాల నియామకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సమస్య విప్రో తో పాటు అన్ని సంస్థలు ఎదురుకుంటున్నాయి.
ఈ సమస్య ను ఎదురుకునేందుకు విప్రో చర్యలు తీసుకుంటుందని విప్రో సీఈఓ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ తీర్రి డెలపోర్టే వెల్లడించారు. విప్రో ఏకంగా ౩౦,౦౦౦ ఫ్రెషర్స్ ని నియమించుకోవాలని అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తోంది. ఈ నియామకాల కోసమే తాజాగా విప్రో ఫ్రెషర్ హైరింగ్ ప్రొగ్రామ్ ప్రారంభించింది.
విప్రో ఫ్రెషర్ హైరింగ్ ప్రోగ్రామ్ వివరాలు (Wipro Fresher Hiring Programme):
విద్యార్హతలు: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన యూనివర్సిటీ (University) నుంచి ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ , ఎంఈ లేదా ఎంటెక్ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 2022 లో కోర్సు పాస్ అవుట్ అవ్వాలి. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మినహా, ఇతర బ్రాంచ్‌లల్లో కోర్సు చేస్తున్నవారు దరఖాస్తు చేయచ్చు .
60 శాతం లేదా 6.0 CGPA లేదా యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం సంబంధిత మార్కులతో పాస్ కావాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీ డిస్టెన్స్ లెర్నింగ్, కరస్పాండెన్స్ కోర్స్, పార్ట్ టైమ్ కోర్స్ చదివినవారికి ఛాన్స్ లేదు. ఫుల్ టైమ్ కోర్సులు చదివే వారికే అవకాశం. టెన్త్, ఇంటర్లో 60 శాతం పైగా మార్కులు కలిగి ఉండాలి.
జాబ్ డెసిగ్నషన్ – ప్రాజెక్ట్ ఇంజనీర్
వయస్సు – 25 ఏళ్ల లోపు
వేతనం ఏడాదికి – రూ.3,50,000
సర్వీస్ అగ్రిమెంట్ – 12 నెలలు
దరఖాస్తు ప్రారంభం– 2021 ఆగస్ట్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 15
ఆన్లైన్ అసైన్మెంట్ – 2021 సెప్టెంబర్ 25, 27
రిజిస్ట్రేషన్ లింక్ – https://careers.wipro.com/elite
ఎంపిక ప్రక్రియ- ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Elite National Talent Hunt) కు రిజిస్ట్రేషన్(Registration) చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల టాలెంట్ ఆధారంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆఫర్ లెటర్ లభిస్తుంది.
ఆన్లైన్ అసెస్మెంట్ – ఆన్లైన్ అసెస్మెంట్ (online assessment)లో మూడు విభాగాలు ఉంటాయి. ఆన్లైన్ అసెస్మెంట్ మొత్తం 128 నిమిషాలు నిర్వహించనున్నారు, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఎబిలిటీకి 48 నిమిషాలు ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 నిమిషాలు, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ 60 నిమిషాలు ఉంటుంది. కోడింగ్ (Coding)లో రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించినవి ఉంటాయి.
ఇతర పరిణామాలు – అసెస్మెంట్ రాసే సమయం లో ఒక బ్యాక్లాగ్ ఉంటే అనుమతి ఇస్తారు. అన్ని బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేస్తేనే ఆఫర్ ఇస్తారు. 2022 నాటికి గరిష్టంగా టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు, 2022 నాటికి గరిష్టంగా మూడేళ్లు ఎడ్యుకేషన్ గ్యాప్ ను అనుమతిస్తారు. గత ఆరు నెలల్లో విప్రో(Wipro) నిర్వహించిన ఇతర సెలెక్షన్ ప్రాసెస్‌లో వున్నవారికి అర్హత లేదు. ఈ ఉద్యోగానికి భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.