జలము మానవాళికి అత్యంత అవసరం. నీరు తాగడం ఎంత అవసరమో సురక్షిత మంచి నీరు తాగడం అంతే ముఖ్యం. అయితే ఇందుకు అవకాశం మన దేశంలోనే ఎంతో మందికి లేదు. అంతెందుకు మధ్య, దిగువ మధ్య తరగతులు సైతం నీటిని శుద్ధి చేసే వాటర్ ప్యురిఫైయర్ ను కొనుగోలు చేయలేరు. కారణం మార్కెట్లో లభించే RO ప్యురిఫైయర్లు ధర ఏదీ కనీసం లో కనీసం 8000 తక్కువ లేదు. అందరూ మరింత చౌకగా లభించే వాటర్ ఫిల్టర్లకే ఓటు వేస్తున్నారు. అయితే శుద్ధత మాట అటుంచి అసలు నీటిలో ఉండే మినరల్స్ కూడా దీని ద్వారా కోల్పోయే ప్రమాదం ఉంది. మన దేశమంతటా ఇదే పరిస్థితి. దీనికి బెంగుళూరు కుర్రాడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. అందరికీ అందుబాటు ధరలో కేవలం 1500 రూపాయలకే వాటర్ ప్యురిఫైయర్ ను తయారు చేసాడు. అదే జల్ సమాధాన్.
సాధారణంగా నీటిని కలుషితం చేసే హెవీ మెటల్స్, డై (dye) మొదలైనవి నిర్మూలించడానికి రక్షిత్ ప్రభాకరన్ అనే 24 ఏళ్ల బెంగుళూరుకు చెందిన అబ్బాయి అందరికీ అందుబాటు ధరలో వాటర్ ప్యురిఫైయర్ ను తయారు చేయాలని పూనుకున్నాడు. ఇందుకోసం ఇతను చెరకు, కొబ్బరి పీచు (coir), అల్ట్రా వయొలెట్ బల్బ్, ఒక motor వంటివాటితో వాటర్ ప్యురిఫైయర్ ను తయారు చేసాడు. దీనిలో ఈ చెరకు మరియు కొబ్బరి పీచును నీటిలోని కలుషిత పదార్ధాలను పీల్చుకునేందుకు bio absorbent గా ఉపయోగించాడు. ఈ రెండిటినీ activated మరియు raw forms లో పొరలు పొరలుగా అమర్చాడు. ఒక్కో పోరా ఒకటి నుంచీ ఒకటిన్నర అంగుళాల మందం ఉండడంతో నీరు ఈ bio absorbent ఛాంబర్ దాటడంతోనే దానిలోనే ఎన్నో మలినాలు పోయి శుద్ధి చేయబడుతుంది. ఇక అల్ట్రా వయొలెట్ బల్బ్ అనేది నీటిలోని సూక్ష్మ క్రిములను నిర్మూలించేందుకు ఉపయోగపడుతుంది. ఇక దీనిలో మోటార్ తోనే నీరు ఒక్కో ఛాంబర్ నుంచీ మరో ఛాంబర్ లోకి చేరుతుంది. దీనిలో సగటున రోజుకు 15 లీటర్ల నీరు శుద్ధి చేస్తుందనీ, ఇది ఒక చిన్న కుటుంబానికి సరి పడుతుందనీ అంటున్నాడు.
ఇలా ఎంచుకున్న వస్తువులు అందరికీ ఎంతో సులభంగా లభించేవి కావడంతో కేవలం 1500 రూపాయలకే వాటర్ ప్యురిఫైయర్ ను తయారు చేయగలిగాడు. అంతే కాదు దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని అనేక ల్యాబ్ లలో పరీక్షించగా ఎంతో సురక్షితమైనదనీ అలాగే ఇందులోని మినరల్స్ ఏ మాత్రం కోల్పోకుండా ఉన్నదనీ తేలింది. ఇప్పుడు రక్షిత్ ఈ జల్ సమాధాన్ ను గ్రామీణ ప్రాంతాల్లో వారికి అందించగలిగితే తన కల ఫలించినట్టేనని అంటున్నాడు.
మేధస్సుకు పెద్ద పెద్ద సంస్థలే కొలమానం కాదు. స్పందించే లక్షణం, ఆశయం ఉండాలే కానీ ఎవ్వరైనా ఎంతటి వారికైనా దీటుగా దేన్నైనా సృష్టిoచగలరని అర్ధం అవుతుంది కదూ. మన ప్రభుత్వాలు రక్షిత్ వంటి ప్రతిభావంతులను గుర్తిస్తే మన దేశం మరింత వెలిగిపోతుంది అనడంలో సందేహం లేదు.