ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎయిడ్స్, కాన్సర్, టీబి వంటి ప్రమాదకర రోగాలతో పోటీపడగల మరో జబ్బు డయాబెటిస్. ఈ జబ్బుతో బాధ పడేవారు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్లు ఉన్నారు. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 415 మిలియన్ మరియు 2040 నాటికి 642 మిలియన్ కానుంది ఈ సంఖ్య. ప్రస్తుతం ప్రపంచoలో ప్రతీ పది మందిలో ఒకరికి డయాబెటిస్ ఉంది. అలాగే పదిలో 5 మందికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది (ప్రీ డయాబెటిస్). ఇదీ దీని చరిత్ర. అందువల్ల ఈ జబ్బు కోసమే ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరే, ప్రస్తుతం ఈ జబ్బు అంటే మన శరీరంలో గ్లూకోస్ స్థాయిని తెలుసుకోవాలంటే సూది గుచ్చి రక్త పరీక్ష చేస్తారు. అలాగే glucose monitors లో కూడా ఈ చేతి వేలికి సూది పోటు అనివార్యం. ఇక ఈ సూది పోటు అవసరం లేని పరికరాలు ఉన్నాయి కానీ అవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. మన దేశంలో తక్కువ కానీ విదేశాల్లో తీవ్రమైన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు నాలుగు పూటలా వారి గ్లూకోస్ స్థాయిని సరిచూసుకోవాల్సిందే. అలా చేతి సూదిపోట్లమయం అయిపోతుంది. అందువల్ల చెప్పేదేమిటంటే మన శరీరంలో గ్లూకోస్ ఎప్పుడెప్పుడు ఎలా ఉంది హెచ్చుతగ్గులు తెలుసుకుని దానికి తగ్గట్టు ఆహారం, వ్యాయామం చేయాలంటే నొప్పి లేకుండా తేలిగ్గా ఒక స్కిన్ పాచ్ ను తయారు చేసారు చైనా కు చెందిన పరిశోధకులు.
ఈ స్కిన్ పాచ్ ద్వారా గ్లూకోస్ ను గమనించాలంటే దానికి రెండు అంచెలుగా చేయాల్సి వస్తుంది. 1. Hyaluronic acid ను చేతి మీద కొంచెం వేసి, ఆ పైన ఒక పేపర్ బాటరీ తో దానిని రుద్దాలి. అలా చేయడం వల్ల ఈ acid చర్మo లోపలి చొచ్చుకుని పోయి రక్తంలోని గ్లూకోస్ ను సరిగ్గా చర్మం కిందకి వచ్చేలా చేస్తుంది. ఈ acid వేసిన 20 నిముషాల తరువాత ఈ స్కిన్ పాచ్ వేయాలి. 2. ఈ స్కిన్ పాచ్ 3 మైక్రోమీటర్ల మందంతో తయారై 5 పొరలు కలిగి ఉంటుంది. ఈ స్కిన్ పాచ్ చూడటానికి ఒక బ్యాండ్ ఎయిడ్ లా ఉంటుంది. మధ్యలో gold foil కలిగి ఉంటుంది. ఈ గోల్డ్ foil మరియు ఈ పాచ్ లోని మిగతా పొరలు, చర్మం కింద చేరిన గ్లూకోస్ ను ఒడిసి పట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మాదిరి దీనిని పాచ్ లో కలిగి ఉంటుంది.
కొద్ది సమయం తరువాత ఈ పాచ్ ను తీసేసి దీనిలోని ఎలక్ట్రికల్ signals మరో పరికరంతో చదవడం ద్వారా శరీరంలో గ్లూకోస్ ఎంత ఉందో చెప్పచ్చు అంటున్నారు Tsinghua University కి చెందిన ప్రొఫెసర్ Xue Feng. ఈ పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ పాచ్ ద్వారా ఎలాంటి నొప్పి లేకుండా CGM (Continuous Glucose Monitoring) సాధ్యం. సరే, ఈ పాచ్ ను కొంత మంది డయాబెటిస్ రోగుల మీద పరీక్షించగా ఈ పాచ్ అత్యంత సమర్ధవంతంగా పని చేసిoది సంప్రదాయ పద్ధతులకు ఏ మాత్రం తీసిపోని విధంగా సరైన గ్లూకోస్ రీడింగ్ చూపించింది.
ఈ డయాబెటిస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ఇటువంటి పాచ్ ల అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాల్లో సైతం ఈ వ్యాధి పట్ల అవగాహన తీసుకురావచ్చు.