ఏసి. దీని వాడకం ఈ దశాబ్ద కాలంలో బాగా పెరిగింది. దీన్ని ఇళ్ళల్లో, స్కూళ్ళల్లో, కార్యాలయాల్లో, బస్సుల్లో…అన్ని చోట్ల దీని వాడకం పెరిగింది. ఇది లోపల ఉన్న వారికి చల్లదనాన్ని ఇచ్చినా, ఇది బైటికి చాలా వేడిని వదిలిపెడుతుంది. అంతే కాదు దీని తయారీలో క్లోరో ఫ్లోరో కార్బన్ వాడటం వల్ల వాతావరణానికి హాని జరుగుతుంది. ఇక ఇవి పని చేయడానికి చాలా విద్యుత్ శక్తి ఖర్చు అవుతుంది. దాని ఫలితంగా వచ్చే విద్యుత్ బిల్లులు కట్టుకోవడం మనకు కొత్తేమి కాదు.
అందుకే ఏసికి ప్రత్యమ్న్యాయ మార్గాల అన్వేషణ మొదలైంది. ఇందుకోసం స్పెయిన్ లోని “The Institute for Advanced Architecture of Catalonia, Barcelona” కు చెందినా విద్యార్థులు ఒక ప్రయోగం చేశారు. అదే ఈ “హైడ్రో సిరామిక్ వాల్” (hydro ceramic wall). ఈ గోడను హైడ్రో జెల్ బబుల్స్ తో తయారు చేస్తారు.
ఈ గోడలోని బబుల్స్ బయటి వాతావరణం తో సంకర్షణ (ఇంటరాక్ట్) చెందుతాయి. ఇవి తమ పరిమాణం కంటే 400 రెట్లు ఎక్కువ తేమను పీల్చుకోగలవు. అలా లోపల ఉన్న తేమ బయటి వేడికి ఆవిరి అయిపోగా లోపల చల్లదనం ఏర్పడుతుంది. దీనినే “పాసివ్ కూలింగ్” (passive cooling) అంటారు. ఈ విధంగా ఈ గోడ 5 డిగ్రీలకు ఉష్ణోగ్రతను తీసుకువస్తుంది. ఈ విధానంలో సాధారణ ఏసిల కంటే 28 శాతం తక్కువ విద్యుత్ వినియోగించుకుంటుంది. ఇక చలి కాలంలో వుండే తక్కువ తేమ వల్ల ఈ బబుల్స్ కూలింగ్ అనేది ఉత్పత్తి చెయ్యవు అందువల్ల ఉష్ణోగ్రత ఎక్కువ గా ఉండి కొంచెం వేడి వాతావరణం వుంటుంది.
ఈ ప్రయోగం ఇప్పటికి ఇంకా తొలి దశలోనే వుంది. దీన్ని అభివృద్ధి చేస్తే ఏసిలకు ప్రత్యామ్న్యాయ మార్గం సుగమం అయినట్టే. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞయానం ద్వారా వాతావరణానికి ఇక పై జరగబోయే హానికి అడ్డుకట్ట వేయగలుగుతాం.