ఉత్సాహాన్ని కొనుక్కోవడం ఏంటా…అనుకుంటున్నారా?? అదేంటో చదవండి మరి. మనము అనుకున్నఫలితం వస్తే ఉత్సాహం, లేదంటే నిరుత్సాహం. ఏదైనా పరీక్ష లేదా ఇంటర్వ్యూ అయితే ఉద్వేగానికి లోనవుతాం. అది మానవ నైజ౦. అయితే ఒక్కోసారి మన మానసిక స్థితికి విరుద్ధమైన సందర్భాలు ఎదురవుతాయి, అదే విధి. అటువంటప్పుడు మన మానసిక స్థితిని మార్చుకోగలిగితే ఎంత అద్భుతంగా వుంటుందొ చెప్పండి. అటువంటి అద్భుత ప్రయత్నమే చేసింది అమెరికాకు చెందిన ఒక కంపెనీ. అదే ఈ Thync అనే పరికరం.
ఇది తలకు ధరించే త్రికోణాకారంలో వుండే ఒక చిన్న పరికరం. దీనిలో మనకు కావలసిన మూడ్ స్ట్రిప్ ను ఇందులో వేసుకుంటే, ఆ విధమైనటువంటి మానసిక స్థితిని పొందవచ్చు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మన సెల్ ఫోనులో సిమ్ కార్డు వేసుకున్నట్టు అన్న మాట. దీనిలోని లోపవర్ ఎలక్ట్రోడ్స్ మన మెదడులోకి ఎలక్ట్రికల్ ఇంపల్స్ (Electrical impulse) లను పంపిస్తాయి. ఇవి మన మెదడు లోనిమానసిక స్థితికి కారణమయ్యే న్యూరోట్రాన్స్మిటర్ను ప్రభావితం చెస్తాయి.
దీనిని మీ ఐఫోనుకు అనుసంధానం చేస్తారు. దానీలోని ప్రత్యేకమైన యాప్ ద్వారా మనకు కావాల్సినప్పుడు కావాల్సినంత ఉత్సాహంతో ఉండచ్చు. కేవలం కొంచం సేపు దినిని ధరిస్తే చాలు, కొన్ని గంటల సేపు దీని యొక్క ఫలితం వుంటుంది.
అయితే దీనితో పాటు లభ్యమయ్యే స్ట్రిప్స్, ఒక్కసారి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ Thync పరికరంతో పాటు 10 కామ్ (calm) మరియు 10 ఎనర్జీ (energy) స్ట్రిప్స్ ను ఉచితంగా పొందవచ్చు. దీని ధర కేవలం $299 మాత్రమే!!! ఇంతటి అధ్బుతమైన పరికరం మరి కాస్త చౌకగా లభించాలని కోరుకుందాం.