ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న నానుడి అందరికీ తెలిసిందే. మరి డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్న సామ్ సంగ్ దాన్ని నిజం చేసేలా ఏమి చేసిందో చూద్దాం.
కొన్ని శతాబ్దాల పూర్వం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సమాచారాన్నిచేరవేయడానికి “స్క్రోల్స్” ఉపయోగించేవారు. కొద్దో గొప్పో మార్పులతో ఇంచుమించు ప్రపంచాదేశాలన్నిటా ఇటువంటి విధానం అమల్లో వుంది. పెపైరస్ వంటి వాటి మీద కావాల్సిన సమాచారాన్నిరాసి దాన్ని ఒక గొట్టంలో భద్రపరుస్తారు. వీటినే స్క్రోల్స్ అంటారు.
ఆ కాలం నాటి వ్యవస్థలోని సరళ శైలిని, నేటి తరానికి కావాల్సిన సాంకేతికతను మేళవించి టాబ్లెట్ ను “డిజి రోల్ అప్” గా తీర్చిదిద్దింది సామ్ సంగ్. దీనిలో రెండు యుస్ బి పోర్ట్స్, రెండు స్పీకర్స్ మరియు టచ్ స్క్రీన్ వున్నాయి. కాగితం లాగ ఈ స్క్రీన్ రోల్ చేయబడటమే దీని యొక్క అత్యంత ఆకర్షణీయమయిన అంశం. ఇది తక్కువ చోటులో, తక్కువ బరువుతో మన హ్యాండ్ బ్యాగులో మరెక్కడైనా సులువుగా ఇమిడిపోయేలా దీన్ని తయారు చేసారు.
ఇది మార్కెట్లో విడుదల అయితే డిజిటల్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది అనడంలో సందేహం లేదు.